హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajasthan Crisis | సచిన్ పైలెట్‌కు మద్దతుగా 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

Rajasthan Crisis | సచిన్ పైలెట్‌కు మద్దతుగా 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్

రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్

Sachin Pilot | సచిన్ పైలెట్‌కు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఏఎన్ఐ తెలిపింది.

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు రాజస్థాన్ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ పైలెట్‌కు మద్దతు పలికుతున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ తనను పట్టించుకోవడం లేదని, తనను సైడ్ లైన్ చేసేస్తున్నారని అసంతృప్తితో ఉన్న సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి బీజేపీలో చేరతారంటూ ఢిల్లీలో గుప్పుమంటోంది. ఇప్పటి వరకు సచిన్ పైలెట్ వెంట 19 మంది, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య 30కి పెరిగినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు పలికినట్టు పేర్కొంది.

మరోవైపు బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఈ అంశంపై స్పందించారు. తన స్నేహితుడు అయిన సచిన్ పైలెట్ ను కూడా ‘తొక్కేశారని’ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇలాగే ఉందని ఈ మాజీ కాంగ్రెస్ నేత అన్నారు. గతంలో ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.

First published:

Tags: Ashok Gehlet, Rajasthan, Sachin Pilot

ఉత్తమ కథలు