Home /News /national /

POLITICS RAJASTHAN MINISTER ASKS CM GEHLOT TO RELIEVE HIM FROM DISHONOURABLE POST PVN

Minister : మంత్రి పదవి నుంచి తనను తొలగించాలని ఏకంగా మంత్రే సీఎంకు లేఖ

రాజస్తాన్ మంత్రి అశోక్ చంద్నా

రాజస్తాన్ మంత్రి అశోక్ చంద్నా

,Minister asks CM to relieve him : పదవి కోసం రాజకీయ నాయకులు ఎన్ని విన్యాసాలైనా చేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పదవి కోసం దానికోసం వందసార్లు అర్జీలు పెట్టుకుంటారు. పెద్దవాళ్లను ప్రసన్నం చేసుకుంటారు

,Minister asks CM to relieve him : పదవి కోసం రాజకీయ నాయకులు ఎన్ని విన్యాసాలైనా చేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పదవి కోసం దానికోసం వందసార్లు అర్జీలు పెట్టుకుంటారు. పెద్దవాళ్లను ప్రసన్నం చేసుకుంటారు. ఇక పైరవీలు, సేవా కార్యక్రమాలతో చాలా ప్రయత్నాలే చేస్తారు.  అయితే కొన్నిసార్లు ఎంత చేసినా కొంతమందికి ఆ పదవి దక్కదు. కానీ ఆ అదృష్టం దక్కించుకున్న ఓ మంత్రి మాత్రం ఆ పదవి వద్దు బాబోయ్ అంటున్నారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించాలని ఏకంగా ముఖ్యమంత్రిని కోరారు. ప్రిన్సిపల్ సెక్రటరీకే అన్ని శాఖలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని బండి నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్‌ చంద్నా రాజస్తాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిలీఫ్‌ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా తన పరిధిలోని శాఖల్లో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కుల్దీప్‌ రంకా జోక్యం మితిమీరిపోయిందని తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు గౌరవం లేనిచోట తాను ఉండలేనంటూ సీఎంకు గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేస్తూ మంత్రి అశెక్ చంద్నా లేఖ రాశారు. తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తంచేశారు అశోక్ చంద్నా. అనంతరం అశోక్ చంద్నా ఓ ట్వీట్ లో.."గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ నేను మీకు వ్యక్తిగతంగా ఒక అభ్యర్థన చేస్తున్నాను. ఈ క్రూరమైన మంత్రి పదవి నుంచి నన్ను విడిపించి, నా శాఖలన్నింటిని ప్రిన్సిపల్ సెక్రటరీ కుల్దీప్‌ రాంకాగారికి అప్పగించండి, ఎందుకంటే అతను అన్ని శాఖల మంత్రి. ధన్యవాదాలు"అని పేర్కొన్నారు. అంటూ అశోక్ చంద్నా ట్వీట్ చేశారు.

ALSO READ Leaked Video : కాక్ పిట్ లో కామకేళి..ఎక్కువ సేపు శిక్షణ ఆశ చూపి ట్రైనీ పైలట్ తో శృంగారం

అధికారుల అతి, భూ దందాపై ఎమ్మెల్యే గణేశ్‌ గోర్గా ఆరోపణలు చేసిన కొన్ని రోజుల్లోనే ఏకంగా ఓ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. గతవారం కాంగ్రెస్ నేత గణేష్ గోగ్రా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు మంత్్రి వ్యాఖ్యలు రాజస్తాన్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గెహ్లాట్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది మునిగిపోయే పడవ.. పరిస్థితులు చూస్తే 2023కు ముందే అది జరిగేట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియా విమర్శలు గుప్పించారు. అయితే అశోక్ చంద్నా చేసిన అభ్యర్థనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాత్రం పట్టించుకోలేదు. పైగా పని ఒత్తిడిలో మంత్రి ఈ ప్రకటన చేశారని చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Congress, Rajastan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు