హోమ్ /వార్తలు /జాతీయం /

భారత్ అబ్బాయి.. పాక్ అమ్మాయి.. ఉద్రిక్తతల ఎఫెక్ట్‌తో పెళ్లి వాయిదా

భారత్ అబ్బాయి.. పాక్ అమ్మాయి.. ఉద్రిక్తతల ఎఫెక్ట్‌తో పెళ్లి వాయిదా

ప్రతీకాత్మక చిత్రం(Reuters)

ప్రతీకాత్మక చిత్రం(Reuters)

థార్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమ, గురువారాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి భారత్‌లోని అటారీ వరకు నడుస్తుంది. అంతా సక్రమంగా ఉండి థార్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు యథావిధిగా కొనసాగి ఉంటే.. మహేంద్ర సింగ్ వివాహం అనుకున్న తేదీకి జరిగేది.

  కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటిదాకా ఇరు దేశాల మధ్య యుద్దం వస్తుందేమో అన్నంతగా సాగిన ఉద్రిక్తతలకు అభినందన్ అప్పగింతతో తెరపడినట్టయింది. ఇదంతా పక్కనపెడితే.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఓ పెళ్లి వాయిదా పడటానికి కారణమవడం హాట్ టాపిక్‌గా మారింది.


  రాజస్తాన్‌లోని బర్మర్ జిల్లా ఖేజద్ కా పార్ గ్రామానికి చెందిన‌ గ్రామానికి చెందిన మహేంద్ర సింగ్‌కు పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ జిల్లా సినోయో గ్రామానికి చెందిన చగన్ కన్వార్‌ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే శనివారం(మార్చి 8)న వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం పాకిస్తాన్ వెళ్లే థార్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు.అయితే భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం వీరి పెళ్లికి అడ్డు వచ్చింది. థార్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్ అధికారులు తాత్కాలికంగా రద్దు చేయడంతో మహేంద్ర సింగ్, అతని కుటుంబం పాకిస్తాన్ వెళ్లలేకపోయింది. దీంతో పెళ్లి వాయిదా పడింది.


  వీసా పొందడంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. పాకిస్తాన్‌కు వీసా పొందడం కోసం మంత్రి గజేంద్ర సింగ్‌తో మాట్లాడాను. ఆయన వల్లే మా కుటుంబంలోని ఐదుగురికి పాక్ వెళ్లేందుకు వీసాలు వచ్చాయి. దీంతో పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్లేందుకు సిద్దమయ్యాం. బంధుమిత్రులకు శుభలేఖలు కూడా పంచిపెట్టాం. కానీ ఇలా జరిగిపోయింది.
  మహేంద్రసింగ్, రాజస్థాన్ వాసి


  థార్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమ, గురువారాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి భారత్‌లోని అటారీ వరకు నడుస్తుంది. అంతా సక్రమంగా ఉండి థార్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు యథావిధిగా కొనసాగి ఉంటే.. మహేంద్ర సింగ్ వివాహం అనుకున్న తేదీకి జరిగేది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి వెళ్లడంతో పెళ్లి వాయిదా పడక తప్పలేదు.

  First published:

  Tags: Imran khan, India, India VS Pakistan, Jammu and Kashmir, Narendra modi, Pulwama Terror Attack, Rajasthan

  ఉత్తమ కథలు