Home /News /national /

POLITICS RAJASTHAN CRISIS HIGH COURT DIRECTS STATUS QUO IN THE CASE AGAINST CONGRESS SK

రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు షాక్.. హైకోర్టులో సచిన్‌కు ఊరట

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్(Image:PTI)

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్(Image:PTI)

కేంద్రాన్ని కూడా చేర్చాలని సచిన్ పిటిషన్ వేయడంతో.. దాన్ని స్వీకరించిన హైకోర్టు తీర్పుకు మరింత కొంత సమయం పడుతుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే యథాతధ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.

    రాజస్థాన్‌ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రోజుకో మలుపుతో డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. తాజాగా రాజస్థాన్ హైకోర్టులో సీఎం అశోక్ గహ్లోత్‌కు బిగ్ షాక్ తగలగా.. రెబల్ లీడర్ సచిన్‌ వర్గానికి ఊరట లభించింది. అనర్హత నోటీసులపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు యథాతధ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పీకర్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. ఐతే ఇందులో కేంద్రాన్ని కూడా చేర్చాలని సచిన్ పిటిషన్ వేయడంతో.. దాన్ని స్వీకరించిన హైకోర్టు తీర్పుకు మరింత కొంత సమయం పడుతుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే యథాతధ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.

    సీఎల్పీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటువేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. ఈ క్రమంలో సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నేపథ్యంలో.. ఆయన నోటీసులు జారీచేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. ఐతే తీర్పు ఇచ్చే వరకు తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు స్పీకర్‌కు సూచించింది.

    హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలంటూ రాజస్థాన్‌ శాసనసభ స్పీకర్‌ సీపీ జోషి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దాన్ని కోర్టు తోసిపుచ్చింది. స్పీకర్‌ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పకూడదా? అని జస్టిస్ మిశ్రా పిటిషనర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించారు. పార్టీలో అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేరని వ్యాఖ్యానించారు. తాజాగా హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించడంతో సచిన్ పైలట్ వర్గానికి ఊరల లభించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ashok gehlot, Congress, Rajasthan, Sachin Pilot

    తదుపరి వార్తలు