Home /News /national /

POLITICS RAJASTHAN CRICIS LIVE CONGRESS TO BRING CONFIDENCE MOTION RAJE MEETS GOVERNOR BA

Rajasthan | రాజస్థాన్‌లో బీజేపీ ఎత్తుకు కాంగ్రెస్ పై ఎత్తు...

అశోక్ గెహ్లోత్, సచిన్ పైలెట్ కలిసిన వేళ (Image: @GovindDotasra)

అశోక్ గెహ్లోత్, సచిన్ పైలెట్ కలిసిన వేళ (Image: @GovindDotasra)

రేపటి నుంచి ప్రారంభమయ్యే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

  రాజస్థాన్‌లో ప్రతిపక్ష బీజేపీ ఎత్తుకు అధికార కాంగ్రెస్ పార్టీ పై ఎత్తు వేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని బీజేపీ సడన్‌గా నిర్ణయం తీసుకుంది. అయితే, తామే విశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. అశోక్ గెహ్లోత్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ వర్గం (19 మంది ఎమ్మెల్యేలు) మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. దీంతో కథ సుఖాంతమైందని అంతా భావించారు. కానీ, అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం మీద అవిశ్వాసం అంటూ అనూహ్యంగా బీజేపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా దానికి కౌంటర్‌గా విశ్వాస తీర్మానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. మరోవైపు విబేధాల తర్వాత తొలిసారి అశోక్ గెహ్లోత్, సచిన్ పైలెట్ ఇద్దరూ కలిశారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. పార్టీ పెద్దలు అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ రణ్ దీప్ సూర్జేవాలా వంటి నేతల సమక్షంలో వారిద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. కలసి ఫొటోలు దిగారు.

  బీజేపీ ఆపరేషన్ నుంచి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వారు తిరిగి జైపూర్ బయలుదేరారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ సీఎం అశోక్‌కు మద్దతుగా నిలిచారు. ఇక రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ మీద విధించిన సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎత్తేసింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ashok gehlot, Congress, Rajasthan, Sachin Pilot

  తదుపరి వార్తలు