హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి గెహ్లాట్ ఔట్.. ముఖ్యమంత్రి పదవి కూడా డౌటే ?

Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి గెహ్లాట్ ఔట్.. ముఖ్యమంత్రి పదవి కూడా డౌటే ?

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(ఫైల్ ఫొటో)

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(ఫైల్ ఫొటో)

Ashok Gehlot: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ బలవంతపు అధికార మార్పిడి చేసే సాహసం కాంగ్రెస్ చేయబోదని.. గతంలో పంజాబ్‌లో ఇలాంటి ప్రయోగమే చేసి ఆ పార్టీ విఫలమైందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే నేతలపై క్లారిటీ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీని కలిసి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలపై ఆమెకు వివరణ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు(Ashok Gehlot) సూచించారు. ఇందుకోసం రాజస్థాన్ సీఎం పదవిని వదులుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే గెహ్లాట్‌కు మద్దతుగా రాజస్థాన్‌లోని కొందరు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వంటి పరిస్థితులు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజస్థాన్ వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. ఈ వ్యవహారంతో గెహ్లాట్‌పై సోనియాగాంధీ సీరియస్ అయ్యారు. ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పించేందుకు డిసైడయ్యారు.

  దీంతో గెహ్లాట్ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గాంధీ కుటుంబం(Gandhi Family) దిగ్విజయ్ సింగ్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. దిగ్విజయ్ సైతం ఈ వార్తలను ధృవీకరించారు. ఈ పరిణామాల మధ్య సోనియాగాంధీని కలిసిన అశోక్ గెహ్లాట్.. తాను అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలపై తాను సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పినట్టు అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే గెహ్లాట్ వ్యాఖ్యలతో ఇప్పుడు మరో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి ధిక్కరణలను కాంగ్రెస్ అధిష్టానం ఏ మాత్రం సహించదు. దీంతో గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ? లేక ఆయన స్థానంలో కొత్తవాళ్లు వస్తారా ? అనే ఊహాగానాలు మొదలయ్యయి.

  అయితే ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పటికిప్పుడు అశోక్ గెహ్లాట్‌ను సీఎం పదవి నుంచి తప్పించకపోయినా.. రాబోయే కొన్ని నెలల్లో అయినా ఆయనకు పదవీగండం తప్పకపోవచ్చనే చర్చ ఢిల్లీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయి.. ఆ తరువాత సమయం చూసుకుని అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ నాయకత్వం వేటు వేసే అవకాశం ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.

  Congress: దిగ్విజయ్ వర్సెస్ శశిథరూర్..రసవత్తరంగా అధ్యక్ష ఎన్నికలు..సోనియా మద్దతు ఎవరికి?

  Congress: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్.. మరిన్ని ట్విస్టులు ఉంటాయా ? అదే జరిగితే..

  రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ బలవంతపు అధికార మార్పిడి చేసే సాహసం కాంగ్రెస్ చేయబోదని.. గతంలో పంజాబ్‌లో ఇలాంటి ప్రయోగమే చేసి ఆ పార్టీ విఫలమైందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తమ మాటను ధిక్కరించిన అశోక్ గెహ్లాట్‌ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ముందు ముందు ఏ రకమైన తీరును ప్రదర్శిస్తుందన్నది చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ashok gehlot, Congress

  ఉత్తమ కథలు