కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీలో సమావేశాలు, మేధోమథనాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. సోనియా గాంధీ(Sonia Gandhi) అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదని సమాచారం. వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం, అటువంటి పరిస్థితిలో సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు(Ashok Gehlot) పార్టీ కమాండ్‌ను అప్పగించాలని సోనియా గాంధీ కోరుతున్నారు. అయితే అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి నిరాకరించారు. గెహ్లాట్‌తో సహా చాలా మంది కాంగ్రెస్(Congress) నేతలు సోనియా గాంధీతో గాంధీ కుటుంబం తప్ప మరెవరూ పార్టీని కట్టడి చేయలేరని చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ అంగీకరించకపోతే 2024 వరకు సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండాలని.. లేదంటే ప్రియాంక గాంధీకి పార్టీ కమాండ్ ఇవ్వవచ్చని పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీకి సూచించినట్లు సమాచారం. గెహ్లాట్‌తో పాటు ముకుల్ వాస్నిక్, వేణుగోపాల్, సెల్జా, మలికార్జున్ ఖర్గే, భూపేష్ బఘేల్ చర్చలో ఉన్నారు. ఇక సోనియా గాంధీ తన రొటీన్ హెల్త్ చెకప్ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి విదేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చీఫ్ ఎంపిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు రాహుల్ గాంధీ. అప్పటి నుంచి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని సోనియాగాంధీ సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్య కారణాలను చూపుతూ మళ్లీ పార్టీ అధ్యక్ష పీఠాన్ని స్వీకరించేందుకు సోనియాగాంధీ నిరాకరించారు. సోనియా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ప్రియాంక గాంధీ వాద్రాపై కేంద్రీకరించిందని, 136 ఏళ్ల సంస్థలోని చాలా మంది సభ్యులు ఇప్పటికీ గాంధీ కుటుంబానికి చెందిన సభ్యుడిని పార్టీని నడిపించాలని కోరుకుంటున్నారని వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక పేలవమైన రికార్డును కలిగి ఉంది. ఇది చాలా మంది మనస్సులలో ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడి పాత్రను స్వీకరించడానికి రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నాలు జరిగినా.. అవేవీ సఫలం కాలేదని తెలుస్తోంది.
Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం..
Hyderabad Old City: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. గోషామహల్ చుట్టూ భారీ సెక్యూరిటీ
ఇక త్వరలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభంకానుంది. 'భారత్ జోడో యాత్ర' పేరుతో దీన్ని చేపడుతున్నారు. దీని మెగా ప్లాన్ లాంచ్ అయింది. 'ఏక్ తేరా కదమ్, ఏక్ మేరా కదమ్, మిల్ జాయే తో జాయే అప్నా వతన్' అనే విజ్ఞప్తితో ఈ యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 7న కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఈ 3500 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించనున్నారు. ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కువ సమయం ఆయన ఈ పాదయాత్రను కొనసాగిస్తారనే సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రజలతో అనుసంధానం కావాలనే తీవ్రమైన సందేశాన్ని ఇవ్వడానికి.. ఐదు నెలల పాటు సాగే ఇండియా జోడో యాత్రలో పాదచారులు హోటళ్లలో ఉండరని, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆగి రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటారని కాంగ్రెస్ ప్రకటించింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Rahul Gandhi, Sonia Gandhi