హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajasthan: కాంగ్రెస్‌ను పొగుడుతూ 12th Class పేపర్‌లో ప్రశ్నలు.. పిల్లల పరీక్షల్లోనూ రాజకీయాలా?

Rajasthan: కాంగ్రెస్‌ను పొగుడుతూ 12th Class పేపర్‌లో ప్రశ్నలు.. పిల్లల పరీక్షల్లోనూ రాజకీయాలా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RBSE Exams: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో... కాంగ్రెస్ పార్టీని కీర్తిస్తూ 12 తరగతి పేపర్‌లో ప్రశ్నలు ఇవ్వడాన్ని.. అక్కడి విపక్షాలు తప్పుబట్టుతున్నాయి. రాజస్థాన్ బోర్డు(RBSE)కు రాజకీయాలు రుద్ధడమేంటని అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌ (Rajasthan)లో కూడా 11, 12 తరగత విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐతే ఓ ప్రశ్నాపత్రం గురించి అక్కడ రాజకీయ దుమారం రేగుతోంది.  కాంగ్రెస్ సాధించిన ఘనతలపై ప్రశ్నలు వచ్చాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకంగా ఆరు ప్రశ్నలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే 12వ తరగతి పరీక్షల్లో కాంగ్రెస్ (Congress) ఘనతలపై ప్రశ్నలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల పరీక్షలకు కూడా రాజకీయాలు అంటించడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుమ్మెత్తిపోస్తున్నాయి.

  PM KISAN: పిఎం కిసాన్ జాబితా నుంచి ఆ రైతులంతా ఔట్.. మే 1 నుంచి గ్రామాల్లో సోషల్ ఆడిట్

  గురువారం రాజస్థాన్‌లో 12వ తరగతి విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ (Political Science) పరీక్ష జరిగింది. అందులో ఆరు ప్రశ్నలు కాంగ్రెస్ (Congress) పార్టీకి సంబంధించినవే ఉన్నాయి.అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఘనత గురించే..! సాధారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో ఒక పార్టీని కీర్తించేలా ఎలాంటి ప్రశ్నలు అడగరు. అంతేకాదు ఒక పార్టీకి సంబంధించిన ప్రశ్నలను కూడా ఎక్కువగా ఇవ్వరు. కానీ అందుకు భిన్నంగా రాజస్థాన్ బోర్డు ప్రశ్నాపత్రాన్ని తయారుచేసింది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పదనే అర్థం వచ్చేలా.. ఆ పార్టీ సాధించిన విజయాల గురించి ప్రశ్నలు అడిగారు. అది కూడా ఆరు ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ గురించే ఉండడ వివాదాస్పదమయింది. మరి ఆ పరీక్షల్లో ఎలాంటి పరీక్షలు అడిగారో ఇక్కడ చూద్దాం.

  పొలిటికల్ సైన్స్ పేపర్‌లో కాంగ్రెస్ పార్టీ గురించి అడిగిన ప్రశ్నలు ఇవే

  1. ఒక సామాజిక, సైద్ధాంతిక కూటమిగా కాంగ్రెస్ పార్టీ గురించి సంక్షిప్త వివరణ ఇవ్వండి?

  2. 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధించింది?

  3. భారత దేశంలో తొలి మూడు సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది?

  4. 1967 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లో పోటీ చేసింది? ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారు? వివరించండి

  5. 1971 ఎన్నికలు కాంగ్రెస్ పున:స్థాపననకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ వ్యాక్యాన్ని వివరించండి.

  6. గరీభ్ హఠావో నినాదం చేసింది ఎవరు..?


  ఇక ఇదే పేపర్‌లో కమ్యూనిస్టు పార్టీ పునర్విభజన, బీఎస్పీకి సంబంధించి మరో ప్రశ్న కూడా ఉంది. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో... కాంగ్రెస్ పార్టీని కీర్తిస్తూ 12 తరగతి పేపర్‌లో ప్రశ్నలు ఇవ్వడాన్ని.. అక్కడి విపక్షాలు తప్పుబట్టుతున్నాయి. రాజస్థాన్ బోర్డు(RBSE)కు రాజకీయాలు రుద్ధడమేంటని అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. గతంలో సీబీఎస్ఈ (CBSE) పరీక్షలో కూడా ఇలాంటి ప్రశ్నపైనే వివాదం నెలకొంది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? అనే ప్రశ్న ఇవ్వడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం ఆ ప్రశ్నను రద్దు చేయడంతో.. అందరికీ మార్కులు ఇచ్చారు.

  Attack On Jawans Bus : కశ్మీర్ లో మరో పుల్వామా తరహా దాడి..జవాన్ల బస్సుపై ఉగ్రదాడి

  ఐతే రాజస్థాన్ పొలిటికల్ సైన్స్‌లో వచ్చిన ప్రశ్నలపై అక్కడి బోర్డు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవేళ ఆ ప్రశ్నలన్నింటినీ రద్దు చేయాల్సి వస్తే.. అందరికీ మార్కులు ఇస్తారు. రాజస్థాన్‌లో ఏటా 9 లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాస్తుంటారు. మార్చిలో మొదలైన రాజస్థాన్ బోర్డు పరీక్షలు త్వరలోనే ముగియనున్నాయి. మేలో ఫలితాలను విడుదల చేస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, EDUCATION, National, Rajasthan

  ఉత్తమ కథలు