Rajasthan Crisis : రాజస్థాన్ అధికార పక్షం కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం మరింత పెరిగేలా ఉంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం సచిన్ పైలట్... పార్టీ రాష్ట్ర పెద్దలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదని చెబుతున్నా్రు. ఆయనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. తద్వారా సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అన్ని అవకాశాలూ సచిన్ పైలట్‌కి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారని తెలుసతోంది. సీఎం పదవి తనకు కాకుండా... అశోక్ గెహ్లాట్‌కి ఇచ్చారనీ... కష్టమంతా తనదైతే... పదవిని గెహ్లాట్ అనుభవిస్తున్నారనే ఆగ్రహంతో రగిలిపోతున్న సచిన్ పైలట్... సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గెహ్లాట్ ఏర్పాటుచేస్తున్న మీటింగ్‌కి వచ్చేది లేదని ప్రకటించారు. దానికి బదులుగా ఆయన జేపీ నడ్డాను కలిసి... భవిష్యత్ కార్యాచరణ ఆలోచించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత... పైలట్... బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాల సమాచారం.
రాజస్థాన్ పరిణామాల్ని బీజేపీ ఓ కంట కనిపెడుతోంది. ఏదో ఒకటి తేలిపైతే... తామేం చెయ్యాలో అది చేద్దామని బీజేపీ పెద్దలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సచిన్ పైలట్... బీజేపీలో చేరితే... అప్పుడు మరింత మంది మద్దతు దారులు కూడా కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరే అవకాశాలుంటాయి. అదే జరిగితే... అశోక గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఇవాళ్టి సమావేశంలో... ప్రభుత్వానికి ఎంత మద్దతు ఉందో, సచిన్ పైలట్ వైపు ఎంత మంది ఉన్నారో అశోక్ గెహ్లాట్ తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీతో కలవడనీ... అలాంటివేవీ జరగట్లేదని అంటున్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్లే. గత ఏడాది కాలంలో.. బీజేపీ... మధ్యప్రదేశ్, కర్ణాటకలో... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల తిరుగుబాట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ ఇదే పొలిటికల్ గేమ్ ఆడుతోందనే వాదన వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియా... సచిన్ పైలట్‌కి మద్దతిస్తున్నారు. అందువల్ల బీజేపీలోకి సచిన్ పైలట్ వెళ్లడమే మిగిలివుందనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Rajastan, Sachin Pilot