హోమ్ /వార్తలు /national /

పోచారం ఎదుట ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణ స్వీకారం

పోచారం ఎదుట ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే రాజాసింగ్ 
(ఫైల్ ఫోటో )

ఎమ్మెల్యే రాజాసింగ్ (ఫైల్ ఫోటో )

హిందూధర్మం పట్ల వ్యతిరేకత ఉన్న ఎంఐఎం శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై సీఎం కేసీఆర్‌ ఆలోచన చేయాల్సిందన్నారు.

  తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి ఎదుట ఆయన చాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత ఉన్న ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండగా తాను ప్రమాణం చేయనని తెగేసి చెప్పారు. దీంతో తాజాగా స్పీకర్‌గా పోచారం ఎన్నిక కావడంతో ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.


  రాజాసింగ్‌తోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు తొలిరోజు సమావేశానికి హాజరు కాని విషయం తెలిసిందే. దీంతో స్పీకర్‌ పోచారం రాజాసింగ్‌తో ఈరోజు ప్రమాణం చేయించారు. రాజాసింగ్‌ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ హిందూధర్మం పట్ల వ్యతిరేకత ఉన్న ఎంఐఎం శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై సీఎం కేసీఆర్‌ ఆలోచన చేయాల్సిందన్నారు. కేసీఆర్‌ కోరుకుంటున్న బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని పోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.


  ఇవికూడా చదవండి:


  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. హైలైట్స్ ఇవే!


  గ్రామ పంచాయతీ ఎన్నికలు : రెండో విడుత బరిలో 10,668 సర్పంచ్ అభ్యర్థులు


  బామ్మ దిద్దిన పంచాయతీ... సర్పంచ్ ఎన్నికల బరిలో 90 ఏళ్ల మహిళ


  First published:

  Tags: Raja Singh, Telangana News

  ఉత్తమ కథలు