Home /News /national /

POLITICS RAHUL GANDHI SAYS CONGRESS OFFERED MAYAWATI UP CM POST BUT SHE DIDNT RESPOND PVN

Rahul Gandhi : మాయావతిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..అందుకు భయపడే బీజేపీకి జై కొట్టింది!

బీఎస్పీ అధినేత్రిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

బీఎస్పీ అధినేత్రిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi On Mayawati : ఇతర రాజకీయ నాయకుల్లా తనకెన్నడూ అధికారంపై ఆసక్తి లేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. తాను పుట్టిందే అధికారం మధ్యలో అని అన్నారు. ప్రతి రోజూ తాను దేశం గురించి ఆలోచించే నిద్రిస్తానని రాహుల్‌ చెప్పారు. 

Rahul Gandhi On Mayawati :  బీఎస్పీ అధినేత్రి మాయావతి,ఆర్ఎస్ఎస్ పై రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో.. మాజీ ఐఏఎస్‌ అధికారి కె.రాజు రాసిన "ది దళిత్‌ ట్రూత్‌-బ్యాటిల్స్‌ ఫర్‌ రియలైజింగ్‌ అంబేద్కర్స్‌ విజన్‌" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్...మాట్లాడారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఈ ఎన్నికల్లో అసలు మాయావతి పోరాడలేదన్నారు. ఎన్నికల సందర్భంగా ​ మాయావతితో కూటమి కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటామని తాము ప్రతిపాదించినా మాయావతి నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఆఫర్​ చేయగా.. కనీసం మాట్లాడేందుకు నిరాకరించారని తెలిపారు. బహుశా ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి ఉండి ఉండవచ్చని రాహుల్ అన్నారు.

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ పట్ల తనకెంతో గౌరవం ఉందని, యూపీలో దళిత స్వరం చైతన్యవంతంగా వినిపించేందుకు ఆయన జీవితాన్ని ధారపోశారని అన్నారు. దీనివల్ల అప్పట్లో కాంగ్రె్‌సకు నష్టం కలిగిన మాటనిజమేనని రాహుల్‌ అంగీకరించారు. యూపీలో దళితుల కోసం కాన్షీరాం గొంతెత్తారని... కానీ ఈసారి మాత్రం దళితుల కోసం మాయావతి నిలబడలేదని..బీజేపీకి ఆమె ఆమోదం తెలిపారని రాహుల్ అన్నారు. దీనికి కారణం.. సీబీఐ, ఈడీ, పెగాసస్​ అని మాయావతిపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక బీఎస్పీ కేవలం ఒకే ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. దాదాపు 72 శాతం మంది బీఎస్పీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు,

ALSO READ Hafiz Talha Saeed: హఫీజ్ సయీద్ కొడుకు హఫిజ్ తల్హా సయీద్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్

ఇక, ఇతర రాజకీయ నాయకుల్లా తనకెన్నడూ అధికారంపై ఆసక్తి లేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. తాను పుట్టిందే అధికారం మధ్యలో అని అన్నారు. ప్రతి రోజూ తాను దేశం గురించి ఆలోచించే నిద్రిస్తానని రాహుల్‌ చెప్పారు. మరోవైపు, మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు కాకుండా అడ్డుపడుతోందని, రాజకీయ నాయకులను నియంత్రించేందుకు పెగాసస్‌ను ఉపయోగించుకుంటోందని రాహుల్‌ ఆరోపించారు. రాజకీయ వ్యవస్థను పెగాసస్‌, సీబీఐ, ఈడీ నియంత్రిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగం.. భారత్​కు ఆయుధమని, అయితే సంస్థలు లేనిదే దానికి అర్ధం లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ముందు మన సంస్థలను రక్షించుకోవాలి. కానీ, అవన్నీ ఆర్​ఎస్​ఎస్ చేతుల్లో ఉన్నాయి అని ఆరోపించారు రాహుల్.

2016లో ఉనాలో దళితుల ఊచకోత ఘటన వివరాలను కూడా రాహుల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ సంఘటన తర్వాత ఎందరో దళితులు ఆత్మహత్యకు ప్రయత్నించారని ఒక దళిత యువకుడి తండ్రి తనకు చెప్పాడని రాహుల్‌ తెలిపారు. ఒక ముస్లిం బాలుడిని కొట్టడం తనకు సంతోషకరమని వీరసావర్కార్‌ అన్నట్లు ఒక పుస్తకంలో చదివానని రాహుల్‌ గుర్తుచేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bsp, Congress, Mayawati, Rahul Gandhi

తదుపరి వార్తలు