హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi Biopic: రాహుల్ గాంధీ బయోపిక్‌‌‌‌పై చర్చ...హీరోయిన్ ఎవరో తెలుసా...?

Rahul Gandhi Biopic: రాహుల్ గాంధీ బయోపిక్‌‌‌‌పై చర్చ...హీరోయిన్ ఎవరో తెలుసా...?

పూనేలో స్టూడెంట్ ఇంటరాక్షన్‌లో సందర్భంగా... ప్రముఖ నటుడు సుబోధ్ భవే... రాహుల్ గాంధీ బయోపిక్ తీసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే బయోపిక్ లో రాహుల్ పక్కన హీరోయిన్ పాత్ర ఎవరు వేయాలో సూచించాలని ఆయనను కోరడం విశేషం.

  ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, మన్మోహన్ సింగ్ బయోపిక్‌లు వెండితెరపై సందడి చేయగా, ప్రస్తుతం నరేంద్ర మోడీ బయోపిక్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బయోపిక్ విషయంలో కూడా వార్తలు వస్తున్నాయి. పూనేలో విద్యార్థులతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాహుల్‌ను విద్యార్థులు పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. అయితే ఈ చర్చకు ప్రముఖ ఆర్‌జే మలిష్క, అలాగే మరో నటుడు సుబోధ్ వ్యాఖ్యాతలుగా నిర్వహించారు. ఇంటరాక్షన్ లో భాగంగా రాహుల్ గాంధీ తన వ్యక్తిగత జీవితం గురించి పలుఅంశాలను విద్యార్థులతో పంచుకున్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ గురించి కూడా రాహుల్ వివరాలు పంచుకున్నారు.

  ఇదిలా ఉంటే ఇంటరాక్షన్ సందర్భంగా లోకమాన్య తిలక్, బాల్ గంధర్వ బయోపిక్ చిత్రాల్లో నటించిన సుబోధ్ భవే రాహుల్ తో సరదా సంభాషణ జరిపారు. రాహుల్ గాంధీ బయోపిక్ తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భవే తెలిపారు. అయితే ఆ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరైతే బాగుంటుందో సజెస్ట్ చేయాలని రాహుల్ ను కోరారు. ఈ ప్రశ్నపై రాహుల్ స్పందిస్తూ...తాను కేవలం చేస్తున్న పనినే వివాహం చేసుకున్నానని, దానితోనే అంకిత భావంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

  అలాగే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రాహుల్ స్పందించారు. ఎవరైతే వర్చువల్ రియాలిటీ అనే ఊహా ప్రపంచంలో జీవిస్తుంటారని, అందులో వారికి నచ్చినట్లు ఉండవచ్చని, అయితే నిజజీవితంలో వాస్తవాలను గుర్తించకుండా ముందుకు కదలలేరని రాహుల్ తెలిపారు.

  First published:

  Tags: Congress, Lok Sabha Election 2019, Rahul Gandhi, Sonia Gandhi, Wayanad S11p04

  ఉత్తమ కథలు