హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

చౌకీదార్ చోర్ హై: కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. సుప్రీంకు మళ్లీ క్షమాపణలు చెప్పిన రాహుల్‌గాంధీ

చౌకీదార్ చోర్ హై: కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. సుప్రీంకు మళ్లీ క్షమాపణలు చెప్పిన రాహుల్‌గాంధీ

అఫిడవిట్‌లో బేషరతు క్షమాపణ చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది

అఫిడవిట్‌లో బేషరతు క్షమాపణ చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది

అఫిడవిట్‌లో బేషరతు క్షమాపణ చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది

    ‘చౌకీదార్ చోర్ హై’.. ఇది ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ. ఇదే అస్త్రంతో రాహుల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దిగారు. అయితే, ఇప్పుడదే విమర్శ కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఎదురైనట్లు అనిపిస్తోంది. రాఫెల్ డీల్‌కు సంబంధించి లీకైన డాక్యుమెంట్లపై సమీక్షకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినపుడు రాహుల్ మోదీపై 'చౌకీదార్' విమర్శలు చేశారు. ఇది తమ నైతిక విజయం అని, 'కాపలదారుడే దొంగ'(చౌకీదార్ చోర్) అని సుప్రీం అన్నదని చెప్పారు. అయితే చౌకీదార్ చోర్ అని తాను చేసిన వ్యక్తిగత విమర్శలను కోర్టు తీర్పుకు ఆపాదించడంపై బీజేపీ నేత మీనాక్షి లేఖీ కోర్టు ధిక్కరణ కింద ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ విమర్శలకు విచారం వ్యక్తం చేస్తూ గతంలోనే రాహుల్ క్షమాపణలు చెప్పారు. దానికి సంబంధించి కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆవేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని, దురదృష్టవశాత్తు చేయాల్సి వచ్చిందని, అందుకు చింతిస్తున్నానని అందులో పేర్కొన్నారు.

    అయితే, ఆ అఫిడవిట్‌లో బేషరతు క్షమాపణ చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదని లేఖీ మరోసారి పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచీ.. రాహుల్‌కు మొట్టికాయలు వేసింది. పూర్తి స్థాయి క్షమాపణ చెప్పినట్లు అఫిడవిట్‌లో కనిపించలేదని, ‘చింతిస్తున్నా’ అన్న పదాన్ని ఎందుకు వాడారని ప్రశ్నించింది. దీంతో, చౌకీదార్ విమర్శలను కోర్టుకు ఆపాదించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని రాహుల్ కోర్టుకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

    First published:

    Tags: Bjp, Congress, Lok Sabha Election 2019, Lok Sabha Elections 2019, Lok Sabha Key Candidates, Rafale Deal, Rahul Gandhi, Supreme, Supreme Court

    ఉత్తమ కథలు