హోమ్ /వార్తలు /జాతీయం /

రాఫెల్ డీల్‌లో మోదీ ఓ మధ్యవర్తి.. ఇదిగో సాక్ష్యం..: రాహుల్

రాఫెల్ డీల్‌లో మోదీ ఓ మధ్యవర్తి.. ఇదిగో సాక్ష్యం..: రాహుల్

రాఫెల్ డీల్‌పై రాహుల్ మీడియా సమావేశం..

రాఫెల్ డీల్‌పై రాహుల్ మీడియా సమావేశం..

అసలా వ్యక్తికి రాఫెల్ డీల్ విషయం ఎలా తెలిసిందని.. మోదీయే ఆ విషయాలను వారికి చేరవేశారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ వ్యవహారాలు ఆ వ్యక్తికి లీక్ అయినా రక్షణ శాఖ ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు.

  రాఫెల్ డీల్‌‌లో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంపై మరోసారి ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాగ్(CAG) నివేదికను 'చౌకీదార్ ఆడిటర్ జనరల్'గా అభివర్ణిస్తూ మోదీని ఎద్దేవా చేశారు. కాగ్ బీజేపీకి అనుకూలంగా నివేదిక ఇస్తుందే తప్ప పారదర్శకంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు. రాఫెల్ డీల్‌పై కేంద్రం పార్లమెంటు ముందుకు కాగ్ రిపోర్టును తీసుకొచ్చేవేళ రాహుల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి ప్రతీరోజూ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయని అన్నారు.


  రాఫెల్ డీల్ వ్యవహారంలో ఆ కాంట్రాక్టు దక్కించుకున్న వారికి ఫ్రాన్స్ కంపెనీకి మధ్య ప్రధాని మోదీ మధ్యవర్తిలా వ్యవహరించారని రాహుల్ ఆరోపించారు. ఓ ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్‌ను ఈ సందర్భంగా మీడియా ముందు ఉంచిన రాహుల్.. ఇదే అందుకు సాక్ష్యం అన్నారు. రాఫెల్ డీల్‌పై ఒప్పందం కుదరడానికి 10 రోజుల ముందే ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రితో ఆ కాంట్రాక్టు కోసం ప్రయత్నించిన వ్యక్తి భేటీ అయినట్టుగా మెయిల్‌లో స్పష్టంగా ఉందన్నారు. రాఫెల్ డీల్‌ను తాను దక్కించుకోబోతున్నానని ఆ సందర్భంలోనే సదరు వ్యక్తి ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రితో చెప్పినట్టుగా అందులో వెల్లడించారన్నారు.


  అసలా వ్యక్తికి రాఫెల్ డీల్ విషయం ఎలా తెలిసిందని.. మోదీయే ఆ విషయాలను వారికి చేరవేశారని ఆరోపించారు. రాఫెల్ వ్యవహారాలు ఆ వ్యక్తికి లీక్ అయినా రక్షణ శాఖ ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు. రాఫెల్ డీల్ తనకే దక్కుతుందని మొదటి నుంచి ఆ వ్యక్తి ధీమాతో ఉన్నారని.. ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని అన్నారు. రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
  First published:

  Tags: Congress, Rafale Deal, Rahul Gandhi

  ఉత్తమ కథలు