హోమ్ /వార్తలు /national /

వైసీపీకి రఘురామకృష్ణంరాజు నెక్ట్స్ కౌంటర్.. డేట్, టైమ్ ప్రకటించిన ఎంపీ

వైసీపీకి రఘురామకృష్ణంరాజు నెక్ట్స్ కౌంటర్.. డేట్, టైమ్ ప్రకటించిన ఎంపీ

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

Raghuramakrishnam Raju | వైసీపీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రఘురామకృష్ణంరాజు ఘాటుగా బదులిచ్చారు.

  వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఆ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో షాక్ ఇవ్వబోతున్నారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు‌కు ఘాటుగా బదులిచ్చిన ఆయన మరో కౌంటర్ సిద్దం చేస్తున్నట్టు తెలిసింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఈనెల 29న వైసీపీకి మరో సమాధానం ఇస్తానని చెప్పారు. ‘నా నెక్ట్స్ సమాధానం జూన్ 29న మధ్యాహ్నం 12 గంటలకు చెబుతా.’ అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

  వైసీపీ ఇచ్చిన 18 పేజీల నోటీసుకు స్పందించిన రఘురామకృష్ణం రాజు.. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ లెటర్ హెడ్ మీద ఎలా షోకాజ్ నోటీసు ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీగా గుర్తుంపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. అలాగే, అసలు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉండాలని, ఎవరైనా నేతలు పార్టీ విధివిధానాలను అతిక్రమిస్తే ఆ కమిటీ మాత్రమే షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. వైసీపీలో అలాంటి కమిటీ ఏదైనా ఉంటే తనకు చెప్పాలని పరోక్షంగా అసలు పార్టీలో అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబితే తన షోకాజ్ నోటీసుకు వివరణ ఇస్తానని ఘాటుగా బదులిచ్చారు.

  ఈ లేఖ పెద్ద దుమారం రేపింది. దీంతోపాటు ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే, కేంద్ర హోంశాఖ అధికారులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఆ లేఖను స్పీకర్ ఓం బిర్లా హోం శాఖ అధికారులకు పంపారు. ఆలేఖ మీద హోం శాఖ అధికారులతో రఘురామకృష్ణంరాజు చర్చించే అవకాశం ఉంది. ఈ రెండు మూడు రోజుల్లో ఇవన్నీ పూర్తి చేసుకుని జూన్ 29న మరో కౌంటర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju, Raghuramakrishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు