రాఫెల్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించినందుకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి కాగ్ నివేదికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు వివరాలు ఇచ్చిందని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయంలో వివరణ కోరుతూ పీఏసీ తరఫున అటార్నీ జనరల్, కాగ్‌కు సమ్మన్లు జారీ చేయాలని పీఏసీ సభ్యులను కోరనున్నట్లు తెలిపారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి కాగ్ ఎప్పుడు పార్లమెంటుకు నివేదిక సమర్పించిందో అటార్నీ జనరల్, కాగ్‌ను ప్రశ్నించనున్నట్లు ఆయన చెప్పారు.
రాఫెల్ డీల్‌పై విచారణకు ఆదేశించాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీనిపై స్పందించిన మల్లికార్జున ఖర్జే తమకు సుప్రీంకోర్టుపై గౌరవం ఉందన్నారు. రాఫెల్ డీల్ విషయంపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరుకోవడం లేదన్నారు. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాఫెల్ డీల్‌కు సంబంధించి కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని ఖర్గే చెప్పారు. అయితే రాఫెల్ డీల్‌పై కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టినట్టు, దీనిపై పీఏసీలో చర్చ జరిగినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని, ఇందులో వాస్తవం లేదన్నారు. కాగ్ నివేదికపై పీఏసీ ఎప్పుడు చర్చించింది? కాగ్ నివేదికపై కాగ్ నివేదికను పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇప్పటి వరకు రాఫెల్ డీల్‌పై కాగ్ నివేధికను పార్లమెంటులో ప్రవేశపెట్టలేదన్నారు. అయితే కేంద్రం తప్పుడు వివరాలను ఇచ్చి, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించిందనిన ఆరోపించారు. సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించినందుకు వెంటనే కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mallikarjun Kharge, Rafale Deal