హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pujab Polls : అసెంబ్లీ ఎన్నికల వేళ..పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్

Pujab Polls : అసెంబ్లీ ఎన్నికల వేళ..పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ ను వీడి ఆప్ లో చేరిన జగ్మోహన్ కంగ్

కాంగ్రెస్ ను వీడి ఆప్ లో చేరిన జగ్మోహన్ కంగ్

Big shock to punjab congress :  జగ్‌మోహన్‌ కాంగ్‌. కాంగ్రెస్ ను వీడటంతో ఆ పార్టీకి ఎన్నికల వేళ భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు.  జగ్‌మోహన్‌ కాంగ్‌..మూడు సార్లు మంత్రిగా పనిచేశారు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Congress leader Jagmohan Kang Joins AAP :   మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఖరార్‌ నియోజకవర్గం టికెట్‌ తనకు కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ నేత జగ్‌మోహన్‌ కాంగ్‌..ఆ పార్టీకి గుడ్ బై చెప్పి మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP)లో చేరారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో జగ్‌మోహన్‌ కాంగ్‌, ఆయన కుమారులు యద్వీందర్ సింగ్ కాంగ్, అమరీందర్ సింగ్ కాంగ్ ఆప్‌ లో చేరారు.  ఆఫ్ లోకి వీరి రాకను కేజ్రీవాల్ సాదరంగా స్వాగతించారని,రోజురోజుకి పంజాబ్ లో ఆప్ బలపడుతుందని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా ఓ ట్వీట్ లో తెలిపారు.

ఖరార్‌ నియోజకవర్గం నుంచి తనకు కాకుండా మద్యం కాంట్రాక్టర్‌ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై సీఎం చన్నీ శైలిపై జగ్‌మోహన్‌సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని పునరాలోచించకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తానని కూడా జగ్‌మోహన్‌సింగ్ బెదిరించారు. రోపర్ కు చెందిన విజయ్ శర్మ టింకూ అనే వ్యక్తికి సీఎం చన్నీ ఖరార్‌ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చారని,టింకూ మద్యం దుకాణం యజమాని అని, అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని జగ్‌మోహన్‌సింగ్ కాంగ్ చెప్పారు. టింకూ కి ఈ టికెట్ ఇవ్వడానికిఆయన (చన్ని) కోట్ల రూపాయలు వసూలు చేశారని నేను నమ్ముతున్నాను అని జగ్‌మోహన్‌సింగ్ కాంగ్ చెప్పారు. అయితే కాంగ్రెస్ తన మాటలను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఆప్ లో చేరారు. కాగా,ఈసారి పంజాబ్ ఎ్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకొని ఆఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే.

ALSO READ Shocking : మూడో భర్త ముందు పాతివ్రత్యం నిరూపించుకోటానికి..కన్నబిడ్డకి నిప్పుబెట్టిన మహిళ

అయితే జగ్‌మోహన్‌ కాంగ్‌. కాంగ్రెస్ ను వీడటంతో ఆ పార్టీకి ఎన్నికల వేళ భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు.  జగ్‌మోహన్‌ కాంగ్‌..మూడు సార్లు మంత్రిగా పనిచేశారు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

:

Published by:Venkaiah Naidu
First published:

Tags: 5 State Elections, AAP, Congress, Punjab

ఉత్తమ కథలు