హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Punjab CM Resign: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా.. గవర్నర్​కు రాజీనామా పత్రం అందజేత

Punjab CM Resign: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా.. గవర్నర్​కు రాజీనామా పత్రం అందజేత

గవర్నర్​కు రాజీనామా అందజేస్తున్న పంజాబ్​​ సీఎం అమరీందర్​ (ఫొటో: Raninder singh: Twitter

గవర్నర్​కు రాజీనామా అందజేస్తున్న పంజాబ్​​ సీఎం అమరీందర్​ (ఫొటో: Raninder singh: Twitter

పంజాబ్​ ముఖ్యమంత్రి (Punjab Chief minister) అమరీందర్​ సింగ్ (Amarinder singh)​ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్రెస్​మీట్​​లో అమరీందర్​ మాట్లాడారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్​భవన్​లో గవర్నర్​ భన్వరిలాల్​ పురోహిత్​కు రాజీనామా పత్రం అందజేశారు.

ఇంకా చదవండి ...

పంజాబ్​ ముఖ్యమంత్రి (Punjab Chief minister) అమరీందర్​ సింగ్ (Amarinder singh)​ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్రెస్​మీట్​​లో అమరీందర్​ మాట్లాడారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్​భవన్​లో గవర్నర్​ భన్వరిలాల్​ పురోహిత్​కు రాజీనామా పత్రం అందజేశారు. అయితే శనివారం ఉదయం రాజీనామా గురించి కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో మాట్లాడానని ఆయన  తెలిపారు. పార్టీలో అవమానానికి గురైనట్లు అమరీందర్​ మీడియా సమావేశంలో వెల్లడించారు. తదుపరి కార్యాచరణను తమ మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం ( Congress High command) ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం (Decision) తీసుకున్నట్లు తెలిసింది. కాగా, తదుపరి సీఎం (CM)గా, ప్రస్తుత పీసీసీ చీఫ్​ నవ్యజోత్​సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu)  లేదా సునీల్ జాఖా ని(Sunil Jakhani) ​ ఎన్నికయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది.

సోనియాకు లేఖతో..

గత కొంతకాలంగా పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమరీందర్ సింగ్‌కు వ్యతిరేక వర్గంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది వరకు అధిష్టానానికి ఓ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్ల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి సీఎల్పీ సమావేశం (CLP Meeting) ఏర్పాటు చేయాలని వారు లేఖలో డిమాండ్ చేశారు. ఇక, పార్టీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో అమరీందర్ సింగ్ విసిగిపోయాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సీఎల్పీ సమావేశం..

ఇక పంజాబ్ కాంగ్రెస్ ఇన్​చార్జ్ హరీష్ రావత్ (Harish Rawat) అర్ధరాత్రి చేసిన ట్వీట్‌తో పంజాబ్‌ కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. సెప్టెంబర్ 18 కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది.. ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే రకమైన ఆదేశాలు జారీచేశారు. సీఎం (CM) పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం అమరీందర్ సింగ్‌ను కోరినట్టుగా ఆ వర్గాలు చెప్పాయి. దీంతో పంజాబ్​ సీఎం అమరీందర్​ రాజీనామా (Punjab CM Resign) చేసినట్లు తెలిసింది.

ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశంలో కొత్త సారథిని ఎనుకోనున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, హరీష్ చౌదరిలు ఢిల్లీ నుంచి పంజాబ్‌కు బయలుదేరారు. ఈరోజు జరిగే సమావేశం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా నవజ్యోత్ సింగ్ సిద్దుని (Navjot Singh Sidhu) గానీ, సునీల్ జాఖా ని(Sunil Jakha) గానీ ఎన్నుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Congress chief, Navjot Singh Sidhu, Politics, Punjab

ఉత్తమ కథలు