హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఏం సెప్తిరి..ఏం సెప్తిరి.. సీఎం.. ఏందయ్యా ఇది.. కెమెరాల ముందు రాహుల్‌కే మస్కానా?

ఏం సెప్తిరి..ఏం సెప్తిరి.. సీఎం.. ఏందయ్యా ఇది.. కెమెరాల ముందు రాహుల్‌కే మస్కానా?

నారాయణ స్వామి వీడియో

నారాయణ స్వామి వీడియో

Narayana samy Video: సీఎంను తిడుతుందని చెబితే బాగోదని.. కవర్ చేసే ప్రయత్నం చేశారు నారాణయస్వామి. మహిళ విమర్శలను ప్రశంసలుగా పేర్కొంటూ అబద్ధం చెప్పారు.

  పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా రాహుల్ గాంధీకే అబద్దాలు చెబుతూ కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం సోషల మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. వామ్మో.. ఇదేంటి.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పారంటూ జనం మండిపడుతున్నారు. అసలేం జరిగిదంటే.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం, ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బుధవారం అక్కడ పర్యటించారు. సీఎం నారాయణ స్వామి సమక్షంలలోనే పుదుచ్చేరి ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సోలాయినగర్ ప్రాంతంలో మత్సకారులతో సమావేశమయ్యారు. ఐతే ఓ మహిళ మైకు అందుకొని సీఎం నారాయణస్వామిని విమర్శించింది.

  తుఫాన్ సమయంలో మా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. సీఎం నారాయణ స్వామి కనీసం చూడడానికి కూడా రాలేదని ఆమె రాహుల్ గాంధీకి చెప్పింది. ఐతే రాహుల్‌కు తమిళ్ అర్ధం కాదు కదా..! ఆమె ఏం చెబుతోందని సీఎం నారాయణ స్వామిని అడిగారు. ఐతే సీఎంను తిడుతుందని చెబితే బాగోదని.. కవర్ చేసే ప్రయత్నం చేశారు నారాణయస్వామి. మహిళ విమర్శలను ప్రశంసలుగా పేర్కొంటూ అబద్ధం చెప్పారు. నివర్ తుఫాన్ సమయంలో తాను పర్యటించి.. అక్కడి ప్రజలకు ఆదుకున్నామని, ఆ విషయాన్నే ఆమె చెబుతోందని రాహుల్‌కు చెప్పారు నారాయణ స్వామి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఈ వీడియోపై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పుదుచ్చేరి అబద్ధాల పర్యటనలో మరో అబద్ధం అంటూ ట్వీట్ చేశారు. ఓ వృద్ధురాలు తుఫాన్ సమయంలో తనకు ఎలాంటి సాయం అందలేదని ఫిర్యాదు చేస్తే.. అన్ని రకాలుగా సాయం చేశానని చెప్పిందని సీఎం చెప్పుకోవడం దారుణమని మండిపడ్డారు.


  కాగా, ఎన్నికల ముందు పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్ బేడీని కేంద్రం తప్పించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Puducherry, Rahul Gandhi

  ఉత్తమ కథలు