హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్​ ఖరారు.. పర్యటన పూర్తి వివరాలు ఇవే..

Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్​ ఖరారు.. పర్యటన పూర్తి వివరాలు ఇవే..

నరేంద్ర మోదీ (ఫైల్​ ఫొటో)

నరేంద్ర మోదీ (ఫైల్​ ఫొటో)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  (Prime minister Narendra modi) అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు (foreign tour) వెళ్లనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది

ఇంకా చదవండి ...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  (Prime minister Narendra modi) అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు (foreign tour) వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రోమ్ (Rome), ఇటలీ (Italy), యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK), గ్లాస్గో (Glasgow)కు ప్రధాని వెళ్తారు. మోదీ 6వ జీ-20 శిఖరాగ్ర సమావేశం, COP-26 వరల్డ్​ లీడర్స్​ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటలీ (Italy) ప్రధాని మారియో (Mario Draghi) ఆహ్వానం మేరకు.. 2021 అక్టోబర్ 30‌‌-31 వరకు రోమ్‌లో జరిగే 16వ జీ -20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని (prime minister) పాల్గొంటారు. ఈ సమావేశంలో జీ -20 (G20) సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ , అంతర్జాతీయ సంస్థల ప్రభుత్వాధినేతలు కూడా పాల్గొంటారు.

ఎనిమిదవది..

ప్రధాని మోదీ హాజరవుతున్న జీ-20 సదస్సు ఎనిమిదవది ఇది. జీ-20 అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం వేదికగా అవతరించింది. భారత్ (India) తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్‌కు ఆతిథ్యం (host) ఇవ్వనుంది. ఇటాలియన్ ప్రెసిడెన్సీ (Italian presidency)లో జరగబోయే శిఖరాగ్ర సమావేశం ‘ప్రజలు, శ్రేయస్సు’ అనే థీమ్ నిర్వహిస్తున్నారు. ఇక జీ-20 శిఖరాగ్ర సమావేశం తర్వాత, ఇంగ్లాండ్​ ప్రధాని (PM) బోరిస్ ఆహ్వానం మేరకు ఐక్యరాజ్యసమితి (United nations) వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC)కి 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP-26) ప్రపంచ నాయకుడి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి PM గ్లాస్గోకు వెళ్తారు. COP-26 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు UK అధ్యక్షతన ఇటలీ భాగస్వామ్యంతో జరుగుతుంది. ఈ సమ్మిట్‌కు 120 కంటే ఎక్కువ దేశాల అధినేతలు హాజరవుతారు.

జీ-20 సదస్సు సమావేశంలో మూడు అంశాలపై చర్చించనున్నారు.

1)మహమ్మారి నుంచి కోలుకోవడం, ప్రపంచ ఆరోగ్య పరిస్థితులను బలోపేతం చేయడం (Recovery from the Pandemic and Strengthening of Global Health Governance).

2). ఆర్థిక పునరుద్ధరణ, స్థితిస్థాపకత (Economic Recovery and Resilience).

3). వాతావరణ మార్పు, శక్తి పరివర్తన (Economic Recovery and Resilience)

4)ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధి (Sustainable Development and Food Security)

UK ప్రధాన మంత్రి బోరిస్​తో..

కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP-26ని వాస్తవానికి 2020లో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2021కి సమావేశాలను వాయిదా వేశారు. ప్రధాన మంత్రి COP-26 తరువాత ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్తోచా సమావేశం అవుతారు. కాగా, ప్రధాని చివరిసారిగా పారిస్‌ (paris)లో జరిగిన COP-21కి హాజరయ్యారు. ఆ సమావేశంలో వాతావరణ మార్పులపై ప్రముఖంగా చర్చించిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Italy, London, PM Narendra Modi, United Kingdom

ఉత్తమ కథలు