గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో (Gujarat Assembly Elections) రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అహ్మదాబాద్ లోని రానిప్ ఉన్నత పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ (Narendra Modi) ఓటేసేందుకు వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ప్రధాని రాగానే లేచి నిల్చున్నారు వారిని కూర్చోమని మోదీ (Narendra Modi) చెప్పారు. అనంతరం పోలింగ్ బూత్ లో ఓటేసిన మోదీ (Narendra Modi) బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా చుక్క ఉన్న వేలును చూపించారు.
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022
ఓటేసిన ప్రముఖులు..పోలింగ్ శాతం ఇలా
కాగా ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తుంది. అలాగే 11 గంటల వరకు 19.17 శాతం నమోదు అయింది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ నమోదు అయింది. అహ్మదాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అతని కొడుకు జైషా ఓటు వేశారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్, సోదరుడు సోమాభాయ్ మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ గవర్నర్ ఆనంది బెన్, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఓటు వేశారు.
Watch | PM Narendrabhai Modi casts vote for State assembly election in Gujarat this morning in Ranip area of Ahmedabad. pic.twitter.com/NtPuUTqk5P
— DeshGujarat (@DeshGujarat) December 5, 2022
తల్లి ఆశిర్వాదం తీసుకున్న మోదీ..
కాగా ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికలలో (Gujarat Assembly Elections) రెండో విడతలో ఓటు వేసేందుకు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు. గాంధీనగర్ లోని ఆమె తల్లి హీరాబెన్ ను మోదీ కలిశారు. అక్కడే సుమారు గంట సేపు గడిపారు. అనంతరం ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అక్కడి నుండి గాంధీనగర్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ నాయకులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు.
గుజరాత్ (Gujarat) లో మొత్తం 182 స్థానాలు ఉండగా..మొదటి విడతలో 89 స్థానాలకు ఎన్నికలు జరగగా..రెండో విడతలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నేడు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 833 మంది అభ్యర్థులు తమ భవితవ్యం ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Gujarat Assembly Elections 2022, Modi, Narendra modi, PM Narendra Modi