Home /News /national /

POLITICS PRESIDENTIAL ELECTIONS DRAUPADI MURMU TO FILE NOMINATION TODAY PVN

Draupadi Murmu : ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము..నేడు రాష్ట్రపతి పదవికి నామినేషన్!

ద్రౌపది ముర్ము

ద్రౌపది ముర్ము

Draupadi Murmu to file nomination : రాష్ట్రపతి ఎన్నికల్లో(President Elections) అధికార ఎన్డీఏ(NDA) తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము(Draupadi Murmu)శుక్రవారం నామినేషన్‌(Nomination) దాఖలు చేయనున్నారు . రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు.

ఇంకా చదవండి ...
Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికల్లో(President Elections) అధికార ఎన్డీఏ(NDA) తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము(Draupadi Murmu)శుక్రవారం నామినేషన్‌(Nomination) దాఖలు చేయనున్నారు . రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ముర్ము నామినేషన్​పై మోదీ, అమిత్ షా, రాజ్​నాథ్, నడ్డా, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. మొదటగా ప్రధాని మోదీ.. ముర్ము పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్‌ పత్రాలను 50 మంది ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది.

ఇక,విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా మే 27న నామినేషన్ దాఖలు చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 29వ తేదీతో ముగియనుంది.

నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

BJP Plan For 2024: 2024 కోసం బీజేపీ భారీ ప్లాన్.. ఏడుగురితో ప్రత్యేక టీమ్.. వాళ్లు ఏం చేస్తారంటే..

కాగా,ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అగ్రవర్ణాలు, ముస్లింలు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు చేపట్టినా ఎస్టీలు మాత్రం చేపట్టలేదు. దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవాన్ని బీజేపీ ఖాతాలో వేసుకోవడానికే ద్రౌపదీ ముర్మూని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది జరిగే రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి బలమైన సంకేతం ఇవ్వడానికి ద్రౌపది ముర్ముని తీసుకొచ్చారన్న వాదన వినిపిస్తోంది. ఎలక్టొరల్‌ కాలేజిలో ఎన్డీయేకి 58శాతం ఓట్లు ఉండటంతో ద్రౌపది ముర్మూ గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పక్షం భావిస్తోంది. ముర్మూ రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే.. రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలు ఆమే అవుతారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Jharkhand, RAPE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు