హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వాజ్‌పేయి జయంతి... నివాళులర్పించిన మోదీ, అమిత్ షా

వాజ్‌పేయి జయంతి... నివాళులర్పించిన మోదీ, అమిత్ షా

వాజ్ పేయి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని నివాళులు

వాజ్ పేయి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని నివాళులు

ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

  ఇవాళ భారత మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా ఘన నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. అటల్‌ సమాధి వద్దకు చేరుకుని అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

  1924, డిసెంబర్‌ 25న వాజపేయి జన్మించారు. 2018 ఆగస్టు 16న ఆయన తుదిశ్వాస విడిచారు. 1991, 1996, 1998, 1999, 2004లో లక్నో నియోజకవర్గం నుంచి లోక్‌సభకు వాజపేయి ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు వాజ్ పేయి జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. వాజపేయి విగ్రహా ఆవిష్కరణ నేపథ్యంలో లక్నోలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఎదుట పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీంతో మోదీ పర్యటనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Pm modi, Ramnath kovind

  ఉత్తమ కథలు