హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భోపాల్ బరిలో అద్వానీ కుమార్తె...అలకబూనిన సీనియర్లను బుజ్జగించేందుకేనా ?

భోపాల్ బరిలో అద్వానీ కుమార్తె...అలకబూనిన సీనియర్లను బుజ్జగించేందుకేనా ?

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై పోటీకి ప్రతిభా అద్వానీని దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సారి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి బరిలో దిగుతుండగా, గడిచిన 30 సంవత్సరాలుగా వరుస విజయాలతో సీటు కైవసం చేసుకుంటున్న బీజేపీ ఈ సారి కూడా భోపాల్ ను తమ ఖాతాలో వేసుకోవాలని ఊవిళ్లూరుతుంది.

ఇంకా చదవండి ...

  బీజేపీ సీనియర్ నేత అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ రాజకీయ అరంగేట్రం వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే అద్వానీని 2019 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించగా, తాజాగా ప్రతిభా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై పోటీకి ప్రతిభా అద్వానీని దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సారి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి బరిలో దిగుతుండగా, గడిచిన 30 సంవత్సరాలుగా వరుస విజయాలతో సీటు కైవసం చేసుకుంటున్న బీజేపీ ఈ సారి కూడా భోపాల్ ను తమ ఖాతాలో వేసుకోవాలని ఊవిళ్లూరుతుంది.

  గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకనే సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను భోపాల్ నుంచి బరిలో నిలిపింది. అయితే దిగ్విజయ్ పై శివరాజ్ సింగ్ చౌహాన్, ఉమాభారతి, సాధ్వి ప్రగ్యా పోటీ చేయవచ్చని ఒక దశలో అంతా భావించారు. అయితే ప్రస్తుతం ఆ అవకాశం అద్వానీ కుటుంబం తలుపు తట్టింది. నిజానికి 2014లోనే స్వయంగా అద్వానీనే గాంధీనగర్ వదిలి భోపాల్ వెళ్లాల్సిందిగా పార్టీ నాయకత్వం సూచించింది. అయితే ఇందుకు అద్వానీ ససేమిరా అన్నారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం అద్వానీ కుమార్తెను వెతుక్కుంటూ వస్తోంది.

  ఇదిలా ఉంటే ఇప్పటికే తనను ఎన్నికల నుంచి దూరంగా పెట్టడం ద్వారా అద్వానీ అలకబూనారు. అంతే కాదు ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉందని గ్రహించిన బీజేపీ వర్గాలు సీనియర్ నేతను బుజ్జగింపులో భాగంగా ప్రతిభా అద్వానీని బరిలో నిలిపేందుకు పావులు కదపుతున్నారు. అయితే భోపాల్‌లో సామాజికవర్గాల పరంగా చూస్తే భోపాల్‌లో ప్రతిభా అద్వానీకి చెందిన సింధి కులస్తుల ప్రాతినిధ్యం కేవలం లక్ష లోపే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా మద్దతుగా నిలుస్తున్న ముస్లిం మైనారిటీల సంఖ్య 3.5 లక్షలుగా ఉంది. అంతే కాదు పోటీలో నిలబడింది మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కానున్న ఈ నేపథ్యంలో ప్రతిభ అద్వానీ ఎలా సత్తా చాటుతారనేది తేలాల్సి ఉంది.

  First published:

  Tags: Amit Shah, Bhopal S12p19, Bjp, Digvijaya Singh, LK Advani, Madhya Pradesh Lok Sabha Elections 2019, Narendra modi

  ఉత్తమ కథలు