హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PK vs Nitish : వయస్సు ప్రభావంతో నితీష్ కి మతి తప్పింది..సీఎంకు పీకే కౌంటర్

PK vs Nitish : వయస్సు ప్రభావంతో నితీష్ కి మతి తప్పింది..సీఎంకు పీకే కౌంటర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీహార్ సీఎం నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prasanth Kishore) మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతోంది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీహార్ సీఎం నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతోంది. బీహార్ లో 3,500 కిలోమీటర్ల జన్ సూరాజ్(Jan Suraj) పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్.. నితీశ్ కుమార్ త‌న‌ను ఇంటికి ఆహ్వానించాడ‌ని, జేడీయూ(JDU)లో చేరి పార్టీని న‌డిపించాల‌ని ఆఫ‌ర్ చేశాడ‌ని ఈ నెల 5న ఆరోపించారు. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పీకేని తన రాజకీయ వారసుడని కూడా పిలిచారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నితీష్ కుమార్ తనను తన రాజకీయ వారసుడిగా చేసినా, తన‌ కోసం సిఎం కుర్చీని ఖాళీ చేసినా తాను అతనితో కలిసి పని చేయనని అన్నారు. ఆ సీఎం ప‌ద‌వి ఇచ్చిన త‌న‌కు వ‌ద్ద‌ని పేర్కొన్నారు. పీకే చేసిన ఈ వ్యాఖ్మలే ఇద్దరి మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది. ప్ర‌శాంత్ కిషోర్ చేసేవి నిరాధార ఆరోప‌ణ‌ల‌ని శనివారం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. " ప్రశాంత్ కిషోర్‌ను నేను ఆహ్వానించలేదు. పీకేనే స్వయంగా నన్ను కలవడానికి వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఏది కావాలంటే అది మాట్లాడనివ్వండి. దానితో మాకు సంబంధం లేదు. నాలుగైదేళ్ల క్రితమే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ పీకే నాకు సలహా ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీ ఎజెండా ప్ర‌కారం ప‌నిచేస్తున్నాడు"అని నితీష్ అన్నారు.

నితీష్ వ్యాఖ్యలపై తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ కౌంట‌ర్ ఇచ్చారు. దీనితీశ్ కుమార్ చెప్పేవ‌న్నీ అస‌త్యాల‌న్నారు. నితీష్ కుమార్ ఏదో చెప్పాలనుకుంటాడు కానీ ఇంకేదో మాట్లాడుతున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. దీనిని ఇంగ్లీషులో బీయింగ్ డెల్యూషనల్ అంటారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తాను జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయ‌మ‌న్నాన‌ని చెబుతూనే, బీజేపీ ఎజెండా ప్ర‌కారం ప‌నిచేస్తున్నాన‌ని నితీష్ ఆరోపించ‌డం విడ్డూరంగా ఉంద‌ని చెప్పారు. మొద‌టి నిజ‌మైతే రెండోది త‌ప్పు, రెండోది నిజ‌మైతే మొద‌టిది త‌ప్పు అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. వ‌య‌సు ప్ర‌భావంతో నితీశ్‌కు మ‌తిత‌ప్పింద‌ని ఎద్దేవా చేశారు. క్కడో రాజకీయంగా తాను ఒంటరి అవుతున్నాను అని నితీష్ కుమార్ ఆందోళన చెందుతున్నారని పీకే అన్నారు. నితీష్ చూట్టూ నమ్మకం లేని వ్యక్తులు ఉన్నారనీ, ఒకవైపు వయస్సు, మరోవైపు ఒంటరితనంలో ఆయన ఉన్నార‌ని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు 30 రోజులు..జోరు వర్షంలోనూ తగ్గని రాహుల్ హుషారు

కాగా, ప్ర‌శాంత్ కిషోర్‌ను 2018లో జేడీయూలోకి నితీష్ కుమార్ చేర్చుకున్నారు. కొన్ని వారాల్లోనే జేడీయూ జాతీయ ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగారు. అయితే, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టర్‌పై నితీష్ కుమార్‌తో జరిగిన గొడవ కార‌ణంగా రెండేళ్లలోపే పార్టీని వీడారు ప్రశాంత్ కిషోర్.పీకేను నితీష్ కుమారే బలవంతంగా బయటకి పంపించారన్న ప్రచారం కూడా ఉంది.

First published:

Tags: Bihar, Bjp, JDU, Nitish Kumar, Prashant kishor

ఉత్తమ కథలు