హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Prashant Kishor: కొత్త పార్టీపై ప్రశాంత్ కిషోర్ ప్రకటన.. జన్ సురాజ్ ధ్యేయంగా జనంలోకి.. బీహార్ నుంచి ఆరంభం

Prashant Kishor: కొత్త పార్టీపై ప్రశాంత్ కిషోర్ ప్రకటన.. జన్ సురాజ్ ధ్యేయంగా జనంలోకి.. బీహార్ నుంచి ఆరంభం

ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిషోర్

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ఖరారు చేస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. జన్ సురాజ్ (పీపుల్స్ గుడ్ గవర్నెన్స్) ధ్యేయంగా జనంలోకే వెళుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలివే..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఎట్టకేలకు సొంత పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ఖరారు చేస్తూ పీకే సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. జన్ సురాజ్ (సుపరిపాలన) ధ్యేయంగా జనంలోకే వెళుతున్నట్లు తెలిపారు. సొంత రాష్ట్రం బీహార్ నుంచే తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు.

ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయబోతున్నారని, ఈ మేరకు సోమవారమే ప్రకటన చేస్తారని గడిచిన కొద్ది గంటలుగా జాతీయ మీడియాలో విసృత ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీపై పీకే కొద్ది సేపటి కిందట ప్రకటన చేశారు. గడిచిన పదేళ్లలో తాను ఏం చేసింది బ్రీఫ్ గా వివరిస్తూ.. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నదీ వెల్లడించారాయన. కొత్త రాజకీయ వేదిక ప్రకటన నిమిత్తం పీకే ఆదివారం నాడే బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. సొంతగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు.. నేడే ప్రకటన?


మీడియా హడావుడి లేకుండా పీకే తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారానే పొలిటికల్ రీఎంట్రీపై ప్రకటన చేశారు. ‘ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలన్నదే నా తపన. ఆ మేరకు గడచిన 10 ఏళ్లలో ప్రజానుకూల విధానాలను రూపొందించడంలో నా వంతు సహాయాన్ని చేశాను. అయితే ఆ ఎగుడుదిగుడు ప్రయాణం ఇక ముగిసింది. నా జీవిత పేజీలను తరచి చూసినప్పుడు.. ఇక నేను నిజమైన నిర్ణేతలు.. అంటే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనిపించింది. జన్ సురాజ్ (సుపరిపాలన) ధ్యేయంగా ప్రజా సమస్యలను మరింత బాగా అర్థం చేసుకోడానికి నేను జనంలోని వెళ్లాలని నిశ్చయించుకున్నాను. ఈ పనిని తొలుత బీహార్ నుంచి ప్రారంభిస్తున్నాను..’అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.

Teenmar Mallanna: బీజేపీకి షాకిచ్చిన తీన్మార్ మల్లన్న.. చేరిన 6నెలలకే గుడ్‌బై.. త్వరలో కొత్త రాజకీయ పార్టీ


ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ 2012లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి పరిచయమై, తొందర్లోనే ఆప్తుడిగా మారి, ఆపై బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా, 2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా జనసామాన్యం మెచ్చేలా చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక భూమిక పోషించారు. మోదీ గద్దెనెక్కిన తర్వాత క్రమంగా బీజేపీకి దూరమైన పీకే గడిచిన ఏడేళ్లలో అన్నీ బీజేపీయేతర పార్టీలకే సేవలందిస్తూ వచ్చారు. దేశంలోని భిన్న ప్రాంతాలు, భిన్న ఐడియాలజీలు కలిగిన పార్టీలతో పీకే పనిచేశారు. గతేడాది బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్త వృత్తిని పూర్తిగా మానేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే స్థిరంగా కొనసాగాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.

CM KCR పాలనకు కేంద్రం కితాబు.. టీబీజేపీలో గడ్కరీ కలకలం.. ప్రసంగ పాఠంలో గడబిడ వల్లేనట!


2017-18 మధ్య కాలంలో జేడీయూలో పనిచేసిన పీకేను అనూహ్య పరిస్థితుల నడుమ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక దిశగా పీకే సుదీర్గ చర్చలు జరిపారు. చివరికి తాను ఆశించినట్లు జరక్కపోవడంతో పీకే.. కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని పక్కనపెట్టేశారు. తాజాగా సొంత ప్రయాణం మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటన చేశారు. పొలిటికల్ రీఎంట్రీని ఖరారు చేసినప్పటికీ పార్టీ స్వరూపం ఎలా ఉంటుంది? వేదికకు ఏ పేరు పెడతారు? విధి విధానాలు, జెండా రంగులు తదితర అంశాలను పీకే త్వరలోనే క్లారిఫై చేయనున్నారు.

World's Worst Zoo: గాయపడ్డ సింహం శ్వాస భయంకరం.. కానీ ఆకలిగొన్న సింహం రూపం కుక్క కన్నా హీనం..


ప్రశాంత్ కిషోర్ సొంత సంస్థ ఐపాక్ కు దేశవ్యాప్తంగా వాలంటీర్లు, ఉద్యోగులు ఉండటం ఒకఎత్తయితే, రాజకీయాల్లోకి యువత రావాలనే నినాదంతో పీకే టీమ్ చేపట్టిన డ్రైవ్ లోనూ అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పేర్ల నమోదు జరిగినట్లు సమాచారం. సొంత రాష్ట్రం బీహార్ లో పీకే ఇదివరకే గ్రామ స్థాయి నుంచి యువతతో కమిటీలు ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత ఆ కమిటీలకు మళ్లీ జీవం పోయాలని, అన్ని రాష్ట్రాల్లో సమాంతరంగా పార్టీ విస్తరణ జరిగేలా పీకే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Published by:Madhu Kota
First published:

Tags: Bihar, Bjp, Congress, Prashant kishor

ఉత్తమ కథలు