Home /News /national /

POLITICS PRASHANT KISHOR BLASTS PM 2024 REMARK SAYS SAHEB CLEVER ATTEMPT PVN

Prashant Kishore : 2024లో ఇలా ఉండదు..మోదీ కామెంట్స్ పై పీకే

ప్రశాంత్​ కిశోర్​(ఫైల్ ఫొటో)

ప్రశాంత్​ కిశోర్​(ఫైల్ ఫొటో)

PK On Modi 2024 Comments : : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి-10న వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక్లలో నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసించింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్‌, గోవాలలో అధికార పగ్గాలను బీజేపీ తిరిగి కైవసం చేసుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పీఠాన్నిదక్కించుకుంది.

ఇంకా చదవండి ...
Prashant Kishor Blasts PM 2024 Remark : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి-10న వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక్లలో నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసించింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్‌, గోవాలలో అధికార పగ్గాలను బీజేపీ తిరిగి కైవసం చేసుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పీఠాన్నిదక్కించుకుంది. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.. ఇక 2024 ఫైనల్లో కూడా గెలుపు మాదే అంటూ కమలనాథులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫైనల్స్‌ కు.. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌గా ముందు నుంచే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి-10న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ సభలో మా ట్లాడిన ప్రధాని మోదీ.. 2022 ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని పేర్కొన్న విషయం తెలిసిందే.

2024 సార్వత్రిక తీర్పును ప్ర‌జ‌లు 2022లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడించారని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌ సభ ఎన్నికలపై ఉండబోదని తెలిపారు. భారత్‌ కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తును నిర్ణయించలేవని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. సాహెబ్‌(ప్రధాని మోడీ)కు ఈ విషయం తెలుసు. అయితే తాజా ఫలితాలను లోక్‌ సభ ఎన్నికలతో ముడిపెట్టి విపక్షాలను ఆందోళనకు గురిచేసి, వాటిపై మానసికంగా పైచేయి సాధించే తెలివైన ప్రయత్నమిదని.. ఆ ఉచ్చులో పడొద్దని పీకే అన్నారు. కాగా, 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో కాంగ్రెస్‌, యూపీలో అఖిలేశ్‌ యాదవ్‌ గెలిచినా దాని ప్రభావం 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కనిపించలేదని ప్రశాంత్‌ కిశోర్‌ గతంలో పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ALSO READ Putin : గేరు మార్చిన పుతిన్..విదేశీ ఫైటర్స్ తో ఉక్రెయిన్ పై దాడులకు గ్రీన్ సిగ్నల్

ఇక,నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం సొంతం చేసుకోవడం తమ సుపరిపాలన, ప్రధాని మోదీ దార్శనికతకు దక్కిన విజయంగా కమలనాథులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 2017లో గెలిచినందువల్లే 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు రాజకీయ విశ్లేషకులు గతంలో అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని నమ్ముతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు