హోమ్ /వార్తలు /national /

మహిళా సీఎంను చూడాలనుకుంటున్నా... వైసీపీ నేత సంచలనం...

మహిళా సీఎంను చూడాలనుకుంటున్నా... వైసీపీ నేత సంచలనం...

సీఎం జగన్ భార్య భారతి(ఫైల్ ఫోటో)

సీఎం జగన్ భార్య భారతి(ఫైల్ ఫోటో)

వ్యాపారవేత్త, వైసీపీ నేత పొట్లూరి ప్రసాద్ సంచలన ట్వీట్ చేశారు. తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

  వ్యాపారవేత్త, వైసీపీ నేత పొట్లూరి ప్రసాద్ సంచలన ట్వీట్ చేశారు. తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 19న ఉదయం 8.26 గంటలకు ఈ ట్వీట్ చేసినట్టు ఉంది. అయితే, ఆ తర్వాత దాన్ని ఆయన తొలగించారు. ‘బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనను పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీమ్‌కోర్ట్. ఆనాడు, అన్న NTR గారు, ఆడవారికి సమాన ఆస్తిహక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వంలో సగం.’ అని తెలుగులో టైప్ చేసిన పేపర్‌ను పోస్ట్ చేసి చివర్లో ‘నమస్కారం’ సింబల్ పెట్టారు.

  పీవీపీ చేసిన ట్వీట్

  వైఎస్ జగన్ మీద సీబీఐ కేసులు ఉన్న నేపథ్యంలో పీవీపీ ట్వీట్ సంచలనాన్ని రేకెత్తించింది. అయితే, ఆయన వెంటనే దాన్ని డిలీట్ చేసేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ అందుబాటులో లేదు. అయితే, అప్పటికే కొందరు ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. పీవీపీ గత ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓటమి చెందారు. అయినా, ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా కేశినేని నాని మీద సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు.

  వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డి (File)

  ప్రసాద్ వి.పొట్లూరి ఉద్దేశంలో మహిళా ముఖ్యమంత్రి అంటే ఎవరు? వైఎస్ భారతిరెడ్డిని ఉద్ధేశించి ఆయన ఈ పోస్ట్ పెట్టారా? లేకపోతే వైఎస్ విజయమ్మను దృష్టిలో పెట్టుకుని ఆ కామెంట్ పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ys bharathi

  ఉత్తమ కథలు