హోమ్ /వార్తలు /national /

జనగామ నాదే... కోదండరాం పోటీ ప్రచారం మాత్రమే: పొన్నాల లక్ష్మయ్య

జనగామ నాదే... కోదండరాం పోటీ ప్రచారం మాత్రమే: పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల లక్ష్మయ్య(Image: Facebook)

పొన్నాల లక్ష్మయ్య(Image: Facebook)

కాంగ్రెస్‌లో సీట్ల పంచాయితీ మొదలైంది. నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. జనగామ సీటును టీజేఎస్‌కు కేటాయించినట్టు వస్తున్న వార్తలపై పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం పార్టీకి మేలు చేయదని అన్నారు.

  పొత్తుల్లో భాగంగా జనగామ సీటును తెలంగాణ జనసమితికి కేటాయిస్తున్నారన్న పుకార్లపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ సీటు తనదేనని స్పష్టం చేశారు. కోదండరామ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కేవలం ప్రచారం మాత్రమే అని పొన్నాల వ్యాఖ్యానించారు. ఈ అంశంలో అధిష్ఠానానికి తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చెప్పారు.

  తనలాంటి వెనుబడిన వర్గానికి చెందిన నేతను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే... పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. జనగామ సీటును టీజేఎస్‌కు కేటాయించడమంటే అధికారపార్టీకి సహకరించినట్టే అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన సీటును వదులుకునే ప్రసక్తే లేదని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.

  మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు ఎనిమిది సీట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ... ఆ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిథ్యం వహించిన జనగామ సీటును కూడా చేర్చినట్టు వార్తలు వినిపించాయి. ఇక్కడి నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రచారంపై స్పందించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Kodandaram, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు