హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sunil Kanugolu | Congress : సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు -పీకే కంటే ముందే మోదీకి వ్యూహకర్త ఎస్కే

Sunil Kanugolu | Congress : సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు -పీకే కంటే ముందే మోదీకి వ్యూహకర్త ఎస్కే

సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిషోర్

సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ పార్టీ పునరుద్ధానం కోసం సోనియా గాంధీ ఇవాళ మూడు కీలక గ్రూపులను ఏర్పాటు చేయగా, వ్యూహకర్త సునీల్ కనుగోలు (ఎస్కే)కు కీలక బాధ్యతలు దక్కాయి. ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడైన ఎస్కే నిజానికి పీకే కంటే ముందే మోదీకి వ్యక్తిగత స్ట్రాటజిస్టుగా పనిచేశారు. పూర్తి వివరాలివే..

ఇంకా చదవండి ...

గడిచిన ఎనిమిదేళ్లుగా వరుస ఓటములతో కుదేలైన జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress) భవిష్యత్ గమనాన్ని రూపొందించడానికి అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) మంగళవారం నాడు మూడు కీలక గ్రూపులను ఏర్పాటు చేశారు. పలు అంశాలపై మార్గనిర్దేశం కోసం పొలిటికల్ అఫైర్స్ గ్రూప్, ఉదయపూర్ 'నవ్ సంకల్ప్' తీర్మానాలను అమలు చేయడానికి టాస్క్ ఫోర్స్-2024, అలాగే, అక్టోబర్ 2 నుంచి మొదలయ్యే ‘భారత్ జోడో యాత్ర’సమన్వయం కోసం సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్ పేర్లతో మూడు కమిటీలను ప్రకటించగా, అందులో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (Sunil Kanugolu)కు కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

ప్రముఖ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడైన సునీల్ కనుగోలు(ఎస్కే).. నిజానికి పీకే కంటే ముందే మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా వ్యవహరించడం, బీజేపీ సూచన మేరకే పీకే ఐపాక్ కు పోటీగా ఎస్కే ‘ఎ బిలియన్ మైండ్స్(ఏబీఎం)’ సంస్థను ఏర్పాటు చేయడం పీకేకు దీటుగా 14 ఎన్నికల్లో వివిధ పార్టీలకు ఎస్కే పనిచేసి ఉండటం గమనార్హం.

CM KCR | Centre : కొత్త అప్పులకు కేంద్రం అడ్డు.. ఆర్థిక దుస్థితిపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు!


కాంగ్రెస్ లో చేరడానికి పీకే పెద్ద పదవులు ఆశించగా, హైకమాండ్ మాత్రం పైన చెప్పిన మూడు గ్రూపుల్లో ఒకదాంట్లో చోటు కల్పిస్తామని ఆఫరిచ్చింది. అందుకు నో చెప్పిన పీకే.. ‘జన్ సురాజ్’ పేరుతో సొంత రాజకీయ వేదికను ప్రకటించడం, అక్టోబర్ 2 నుంచి బీహార్ లో పాదయాత్ర మొదలు పెట్టనుండటం తెలిసిందే. అయితే, ఎస్కే మాత్రం సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ లో చేరిపోయి, పీకేకు పార్టీ ఆఫర్ చేసిన అదే స్థానాన్ని దక్కించుకున్నారు.

సునీల్ కనుగోలు

PM Kisan | PM SYM : రైతులకు మరో శుభవార్త.. ప్రతినెలా రూ.3000 పెన్షన్.. పీఎం కిసాన్ ద్వారా ఇలా..


ఉదయ్ పూర్ లో నిర్వహించిన నవ సంకల్ప్ శిబిరంలో ఆమోదించిన తీర్మానాలను అనుసరించి పార్టీ భవిష్యత్తుకు కీలకం కానున్న మూడు కమిటీలను అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేశారంటూ ఏఐసీసీ మంగళవారం నాడు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్ సభ్యులుగా ఉండే పొలిటికల్ అఫైర్స్ గ్రూప్ (పీఏజీ)కి సోనియా గాంధీనే నేతృత్వం వహిస్తారని పార్టీ పేర్కొంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ‘భారత్ జోడో యాత్ర’పేరుతో కాంగ్రెస్ పాదయాత్రలు చేపట్టనుండగా, దాని పర్యవేక్షణకు నియమించిన సెంట్రల్ ప్లానింగ్ గ్రూపులో సచిన్ పైలట్, శశి థరూర్, రవనీత్ సింగ్ బిట్టూ, కేజే జార్జ్, జ్యోతి మణి, దిగ్విజయ్ సింగ్, ప్రద్యుత్ బోర్డోలోయ్, జీతూ పట్వారీ, సలీమ్ అహ్మద్ సభ్యులుగా ఉంటారు. ఇక,

ఇదేందయ్యా.. 1శాతం లంచానికే మంత్రి పదవి పీకేసి, అరెస్టు చేయించారే! -పంజాబ్ సీఎం సంచలనం


2024 ఎన్నికల కోసం వ్యూహాలు, ఆర్థిక, కమ్యూనికేషన్, మీడియా వ్యవహారల కోసం ‘టాస్క్ ఫోర్స్ -2024’పేరుతో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రియాంక గాంధీ, పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలాతోపాటు వ్యూహకర్త సునీల్ కనుగోలు టాస్క్ ఫోర్స్ సభ్యులుగా ఉంటారు. టాస్ట్ ఫోర్స్ కు ప్రత్యేకంగా చీఫ్ అంటూ లేకుండా సభ్యులకు నిర్దిష్ట పనులను కేటాయించి, నిర్ణయాధికారాలు కూడా వారికే అప్పగిస్తారని పార్టీ ప్రకటనలో పేర్కొనడాన్ని బట్టి సునీల్ కనుగోలుకు కావాల్సినంత స్వేచ్ఛ లభించినట్లయింది. నిజానికి,

CM KCR : సీఎం కేసీఆర్ అనూహ్యం.. దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే అర్దాంతరంగా హైదరాబాద్‌కు.. కారణమిదే..


ప్రశాంత్ కిశోర్ మాజీ శిష్యుడిగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహరచనలో ఒక అడుగు ముందే ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. ప్రశాంత్ కిషోర్ పూర్వ సంస్థ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG) కంటే ముందే సునీల్ కనుగోలు.. నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా వ్యవహరించారు. అలాగే అధికారికంగా బీజేపీ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఎస్కేతో కలిసే పీకే బీజేపీ కోసం పనిచేశారు. మోదీ ప్రధాని అయ్యాక పీకే క్రమంగా దూరమై సొంతగా ఐ-పాక్ సంస్థ ఏర్పాటుచేసుకొని బీజేపీ వ్యతిరేక పార్టీలకు సేవలందించగా, బీజేపీ సూచన మేరకే ఐపాక్ కు పోటీగా ఎస్కే ‘ఎ బిలియన్ మైండ్స్’ (ఏబీఎం) పేరుతో సొంత సంస్థను ఏర్పాటు చేసి, 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించడంలో తోడ్పడ్డారు.

CM Jagan | Min KTR : ఇక్కడ కుస్తీ.. దావోస్‌‌లో దోస్తీ.. పెట్టుబడుల్లో మాత్రం పోటాపోటీ.. ఎవరికి ఎంతంటే..


2017 యూపీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ కోసం పలు రాష్ట్రాల్లో సేవలందించిన సునీల్ కనుగోలు.. అటు శిరోమణి అకాలీదళ్, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కోసమూ పనిచేశారు. 39 ఏళ్ల సునీల్ కనుగోలు.. వివిధ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా మొత్తం 14 ఎన్నికల్లో పనిచేశారని, అందులో తొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి, డీఎంకే కోసం రెండు ఎన్నికలు, అన్నా డీఎంకే తరఫున రెండు ఎన్నికలు, అకాలీ దళ్ కోసం ఒక ఎన్నికలో పనిచేశారని ‘ది ప్రింట్’ రిపోర్టులో వెల్లడైంది.

సునీల్ కనుగోలు

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ తేదీ ఇదే


తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందినవాడుగా ప్రచారంలో ఉన్న సునీల్ కనుగోలు వాస్తవానికి కర్ణాటకకు చెందినవారైనా, చిన్నప్పటి నుంచీ చెన్నైలోనే పెరిగారు. చేసేది ప్రచార వ్యూహాలే అయినా వ్యక్తిగతంగా లోప్రొఫైల్ పాటిచే సునీల్ కనుగోలు ఫొటో కూడా గతేడాది నుంచే సర్క్యులేషన్ లోకి వచ్చింది. తాజాగా కాంగ్రెస్ జెండాల బ్యాగ్రౌండ్ లో ఆయన రెండో ఫొటో బయటికొచ్చింది. పీకేకు దీటైన ప్రొఫైల్ కలిగిన ఎస్కే కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధానం కల్పిస్తారా? లేదా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. తెలంగాణలో టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ కోసం పీకే పనిచేస్తుండగా, టీకాంగ్రెస్ కు సునీల్ కనుగోలు వ్యూహాలు అందించనున్నారు. తద్వారా ఇక్కడ రసవత్తర దృశ్యాలు నెలకొనే అవకాశాలున్నాయి.

First published:

Tags: Bjp, Congress, Pm modi, Prashant kishor, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు