హోమ్ /వార్తలు /national /

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన.. ఈ నిర్ణయాన్ని ఎవరూ ఊహించి ఉండరు

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన.. ఈ నిర్ణయాన్ని ఎవరూ ఊహించి ఉండరు

ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిషోర్

Prashant Kishor: బీహార్ (Bihar) 3వేల కి.మీ. పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికైతే కొత్త పార్టీ ఆలోచన లేదని.. బీహార్‌లో కొత్త సుపరిపాలనా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.

  తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీకి వ్యూహకర్తకు పనిచేయడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరగడంతో.. హాట్ టాపిక్‌గా మారారు. కానీ తాను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో ప్రచారం కూడా జరిగింది. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీని ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపించాయి. దానిపై ఎట్టకేలకు స్పందించారు ప్రశాంత్ కిశోర్. తన భవిష్యత్ రాజకీయాలపై సంచలన ప్రకటన చేశారు. బీహార్ (Bihar) 3వేల కి.మీ. పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికైతే కొత్త పార్టీ ఆలోచన లేదని.. బీహార్‌లో కొత్త సుపరిపాలనా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.

  PM Modi: మిత్రుడు మెక్రాన్‌తో మోదీ చర్చలు.. ప్రధాని యూరప్ పర్యటన సక్సెస్.. ఏం సాధించారంటే

  '' ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం వచ్చింది. బీహార్‌లో పాలనా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తా. బీహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు లేవు. అందువల్ల ప్రస్తుతానికైతే కొత్త పార్టీ ఆలోచన లేదు. అక్టోబర్ 2 నుంచి బీహార్‌లో 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా. వీలైనంత ఎక్కువ ప్రజలను కలిసేందుకు ఈ మూడు నాలుగేళ్ల సమయాన్ని కేటాయిస్తా. వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటా. ఒకవేళ వారు రాజకీయ వేదిక కావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా దాని గురించి ఆలోచిస్తా'' అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ తాజా ప్రకటనపైనా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతారని.. అందుకోసమే పాదయాత్రను ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పాదయాత్ర ముగింపు సభలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందని పేర్కొంటున్నారు.

  PM Modi: ఒకేసారి 5దేశాల అధినేతలతో మోదీ రౌండ్ టేబుల్ మీట్.. అందులో నలుగురు స్టార్ మహిళలే!

  బీహార్‌లో తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన ఇటీవల ఓ ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్. ‘ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలన్నదే నా తపన. ఆ మేరకు గడచిన 10 ఏళ్లలో ప్రజానుకూల విధానాలను రూపొందించడంలో నా వంతు సహాయాన్ని చేశాను. అయితే ఆ ఎగుడుదిగుడు ప్రయాణం ఇక ముగిసింది. ప్రస్తుతం నేను నిజమైన నిర్ణేతలు.. అంటే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనిపించింది. జన్ సురాజ్ (సుపరిపాలన) ధ్యేయంగా ప్రజా సమస్యలను మరింత బాగా అర్థం చేసుకోడానికి నేను జనంలోని వెళ్లాలని నిశ్చయించుకున్నాను. ఈ పనిని తొలుత బీహార్ నుంచి ప్రారంభిస్తున్నాను’అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

  ఈ ట్వీట్‌కు కొనసాగింపుగా నేడు ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. బీహార్‌లో అక్టోబరు 2 నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. కాగా, గతంలో జాతీయ స్థాయిలో బీజేపీతో పాటు పంజాబ్‌లో కాంగ్రెస్, ఏపీలో వైసీపీ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడు డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తున్నారు. 2017-18 మధ్య కాలంలో జేడీయూలో పార్టీ ఉపాధ్యాక్షుడిగా పీకే పనిచేశారు. కానీ అనూహ్య పరిస్థితుల నడుమ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం వ్యూహకర్తగా ఉన్న ఆయన్ను.. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ నేతగా చూసే అవకాశముంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bihar, Prashant kishor

  ఉత్తమ కథలు