హోమ్ /వార్తలు /national /

AP Politics: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. మున్సిపల్ అధికారికి జేసీ ఒంగి నమస్కారం.. ఎట్టకేలకు దిగి వచ్చిన అధికారులు

AP Politics: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. మున్సిపల్ అధికారికి జేసీ ఒంగి నమస్కారం.. ఎట్టకేలకు దిగి వచ్చిన అధికారులు

జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన

జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన

వివాదాస్పద నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. మున్సిపల్ అధికారుల తీరుకు నిరసగా వినూత్నంగా ఆందోళన చేసిన ఆయన.. చివరికి ఒంగి నమస్కారం పెట్టారు. చైర్మన్ వినూత్న నిరసనలతో అధికారులు దిగి రాక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18              తాడ్రిపత్రి రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. తాజగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ కు చేరింది. వివాదాస్పద వ్యాఖ్యలు., రెచ్చగొట్టే తీరుతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంటారు జేసీ బ్రదర్స్. ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా జిల్లాలో టీడీపీ పరువు నిలబెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి... రెండో వైస్ చైర్మన్ పదవిని సైతం టీడీపీ వర్గీయులకే వచ్చేలా పావులు కదిపారు. దీంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మీసం మెలేయడం వంటి చేష్టలతో పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు వెళ్ళింది. ఆ కేసు గొడవ నడుస్కాతుండగానే.. జేసి చేసిన వినూత్న నిరసన రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. చైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. మునిసిపల్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కమిషనర్ సహా మునిసిపల్ సిబ్బంది అంతా గైర్హాజరయ్యారు. తాను పిలిచినా సమావేశానికి సిబ్బంది రాకపోవడంతో చైర్మన్ జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసాడు జేసీ. మొదట మున్సిపల్ కార్యలయం దగ్గరే రాత్రి నిదురించారు. అలాగే అక్కడే స్నానం కూడా చేసిన నిరసన తెలిపారు. అలాగే మున్సిపల్ అధికారులు కార్యాలయం నుంచి బయటకు వస్తుంటే వారికి ఒంగి నమస్కారం పెట్టార. ఇలా వింత ప్రదర్శనలతో జేసీ మరోసారి వార్తల్లో నిలిచారు..

ముందుగా సోమవారం ఉదయం 10.30కి సమీక్షా సమావేశం ఉంటుందని మునిసిపల్ కమిషనర్ తో పాటుగా కార్యాలయ సిబ్బందికి సమాచారాన్ని శనివారం రోజే అందించారు. అయితే  జేసీ నిర్ణయించిన సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రతాప్ రెడ్డి మున్సిపల్ సిబ్బందితో కలసి కరోనా థర్డ్ వేవ్ అవగాహనా ర్యాలీ, సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడంతో అధికారులు సందింగ్ధంలో పడ్డారు. ర్యాలీ... ఎమ్మెల్యే సమీక్షా తరువాత అయినా సిబ్బంది వస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి భావించారు. 12.30 గంటలకి ప్రభాకర్ రెడ్డి కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కానీ మున్సిపల్ సిబ్బంది ఎమ్మెల్యే సమీక్షా అనంతరం అటునుంచి అటే తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కమిషనర్ నరసింహ రెడ్డి కూడా మధ్యాహ్నంపైన సెలవు పెట్టి వేరోకరికి బాధ్యతలు అప్పచెప్పి వెళ్లిపోయారు.

అధికారుల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి త్రీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 4.30నిమిషాలకు కొందరు అధికారులు మున్సిపల్ కార్యాలయానికి రావడంతో అయన ప్రదర్శించిన హావభావాలు చూసి అధికారుల నోటా మాటరాలేదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కమిషనర్ ఎలా సెలవుపై వెళ్తారని., చైర్మన్ ఆదేశాలు కాదని సిబ్బంది గైర్హాజరు కావడంతో తాఖీదులు జారీ చేసినట్లు ప్రకటించిన చైర్మన్ జేసీ.. కమిషనర్ వచ్చే వరకు  రాత్రి కూడా మున్సిపల్ కార్యాలయంలోనే బస చేస్తామని స్పష్టం చేయడంతో పరిస్థితి రసవత్తరంగా మారింది. అయన చెప్పిందే చేసి చూపించారు.... అర్ధరాత్రి అక్కడే భోజనం చేసి... అక్కడే నిద్రపోయారు.

ఇదంతా ఒక ఎత్తైతే 26 మంది పురపాలక సిబ్బంది కనిపించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. అయన పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలిక కమిషనర్ నరసింహప్రసా దొడ్డితో పాటు పురపాలిక ఉద్యోగి చాంద్భాషాకు శనివారం సమాచారం ఇచ్చాం. పురపాలిక వాట్సాప్ గ్రూప్ లో సందేశాన్ని పంపాము. సోమవారం ఉదయం సమా వేశ సమయానికి వచ్చి చూడగా 26 మంది ముఖ్యమైన అధికారులతో పాటు సిబ్బంది విధుల్లో కనిపించలేదు. హాజరు పట్టికలో వారి సంతకాలు లేవు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కమిషనర్ సెలవులో ఉన్నారని, ఆయన స్థానంలో రాజేశ్వరిబాయి ఇన్ఛార్జిగా ఉంటారనే సమాచారం వచ్చింది. ఇటీవల పురపాలిక అధికారులు టెంకాయలు విక్రయించే వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పురపాలిక అధికారులకు, ఉద్యోగులకు ఎవరైనా హాని తలపెట్టి ఉంటారేమోనని ఆందోళన చెందుతున్నాం. వారి ఆచూకీ కనుగొని రక్షించాలని'' జేసీ ప్రభాకరరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.


మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. వినూత్స నిరసనలతో అధికారులు దిగి వచ్చారు..  సమావేశానికి రండి సార్.. అధికారులు, సిబ్బంది అంటూ వస్తున్నారంటూ ఆయనకు సమాచారం అందించారు. దీంతో ఎట్టకేలకు సమావేశం నిర్వహించేలా చూసి పంతం నెగ్గించుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, JC Diwakar Reddy

ఉత్తమ కథలు