హోమ్ /వార్తలు /national /

తిరుపతిలో హై టెన్షన్.. అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్

తిరుపతిలో హై టెన్షన్.. అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మరికొందరు నేతలను వారు బస చేసిన హోటల్‌ గదిలోనే నిర్బంధించారు.

    తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మరికొందరు నేతలను వారు బస చేసిన హోటల్‌ గదిలోనే నిర్బంధించారు. అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, అమర్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ సహా పలువురు నేతలను హోటల్ గదిలో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. టీడీపీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు కూడా రావడంతో అక్కడ పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణ వాతావరణం తలెత్తింది. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే, యాత్రను అడ్డుకోవడంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరుగుతున్నా కూడా సీఎం జగన్ పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు తొలుత పోలీసులు అనుమతి ఇచ్చిన చివరి నిమిషంలో ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. హోటల్ గది నుంచి బయటకు రాకపోయినా తాము నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు తమను బయటకు రానివ్వకుండా చేయడం ఏంటని నిలదీశారు. ధర్మ పరిరక్షణ యాత్ర జరిగితే జగన్ నిజ స్వరూపం బయటపడుతుందనే భయంతోనే అడ్డుకుంటున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గృహనిర్బంధంలో ఉన్న అచ్చెన్నాయుడును వదిలి పెట్టాలని తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి డిమాండ్ చేశారు.

    First published:

    Tags: Andhra Pradesh, Kinjarapu Atchannaidu, Tirupati Loksabha by-poll

    ఉత్తమ కథలు