హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు..

PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు..

ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరు,నాగ్,మహేష్ బాబు (Twitter/Photos)

ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరు,నాగ్,మహేష్ బాబు (Twitter/Photos)

PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు.. ఈ రోజు ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

  PM Narendra Modi: ఈ రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ దేశాల నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన పుట్టినరోజును సేవా దివస్‌గా జరుపుకుంటుంది. దేశ వ్యాప్తంగా సామాజిక సేవా కార్య్రమాలు నిర్వహిస్తోంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 8వ సారి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అంతకు ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.

  బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి భారత ప్రధానమంత్రి అయ్యారు.నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) తన ట్విట్టర్‌లో పుట్టినరోజు విషెస్ తెలియజేసారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీగారికి జన్మదిన శుభాకాంక్షలు. మన దేశ ప్రజలకు సుధీర్థ కాలం పాటు సేవలందించడానికి మీకు మరింత బలం చేకూరాలన్నారు. అంతేకాదు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరకుంటున్నట్టు తెలియజేసారు.

  అటు నాగార్జున కూడా గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశ ప్రతిష్టను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళాతని భావిస్తున్నాను అని నాగార్జున ట్వీట్ చేశారు.

  అటు మహేష్ బాబు కూడా గౌరవనీయులైన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ గారు మీ నాయకత్వంలో దేశం పురోగమించాలని కోరకుంటున్నాను. మీరు ఎల్లపుడు  ఆయురారోగ్యాలతో ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటునన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, Mahesh Babu, Nagarjuna Akkineni, National, PM Narendra Modi, Tollywood

  ఉత్తమ కథలు