Home /News /national /

POLITICS PM NARENDRA MODI TELANGANA TOUR BJP VS TRS PM MODI TO VISIT HYDERABAD ON 26TH MAY HERE IS MORE DETAILS SK

PM Narendra Modi: మే 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. బీజేపీ దూకుడు.. టార్గెట్ కేసీఆర్

ప్రధాని మోదీ (Image : PTI)

ప్రధాని మోదీ (Image : PTI)

PM Narendra Modi: తెలంగాణలో ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అమిత్ షా, రాహుల్ గాంధీ పర్యటించారు. తాజాగా ప్రధాని మోదీ కూడా హైదరాబాద్‌కు వస్తున్నారు. జాతీయ నేతల వరుస పర్యటనలు దేనికి సంకేతం? ఇది ముందస్తు ఎన్నికల వ్యూహమేనా?

    తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్ వార్ జరుగుతున్న వేళ.. నేతల పాదయాత్రలు, జాతీయ నేతల పర్యటనలు.. మరింత సెగలు రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) మహబూబ్ నగర్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్‌ (Hyderabad)లో పర్యటించారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రధాని మోదీ మే 26న రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. వాస్తవానికి ఇది పార్టీ కార్యక్రమం కాదు.. ప్రధాని హోదాలో ఆ కార్యక్రమానికి వెళ్లనున్నారు. ఐతే మోదీ రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ యూనిట్.. ఆయనకు ఘన స్వాగతం పలకాలని భావిస్తోంది. అంతేకాదు రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రధాని మోదీ భేటీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు.

    ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే పార్టీ నేతలతో బండి సంజయ్ (Bandi Sanjay Kumar) చర్చించారు. ఆ రోజు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఐతే ఇది పార్టీ కార్యక్రమం కానందున... బేగంపేటలోనే ప్రధాని మోదీని కలవాని బీజేపీ నేతలు నిర్ణయించారు. అక్కడే పార్టీ నేతలను ప్రధాని మోదీ కలిసేలా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు అనుమతి కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం పంపించారు. దీనికి పీఎంవో నుంచి అనుమతి రావాల్సి ఉంది.

    Shocking: ఎయిమ్స్ చరిత్రలో తొలిసారి.. ఆరేళ్ల బాలిక అవయవదానం... అసలేం జరిగిందంటే..

    మరోవైపు ఈనెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ (Ramagundam Fertilizer Factory) ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరిగాయి. కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. అదేవిధంగా హైదరాబాద్ శివారు జీనోం వ్యాలీలో జాతీయ జంతు వనరుల సౌకర్యం, జీవ వైద్య పరిశోధన సంస్థ (నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్)ను కూడా ప్రధాని ప్రారంభించాలని పీఎంఓకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి అదే రోజు ఈ రెండింటిని కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఐఎస్బీ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ నేరుగా చెన్నైకి వెళ్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ప్రధాని మోదీ పర్యటన ఐఎస్పీ వరకే పరిమితమయినప్పటికీ.. అదే రోజు ప్రధాని మోదీని కలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు మోదీ రాక సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Shocking: పోలీస్ స్టేషన్ లో మహిళపై చిత్ర హింసలు.. బూట్లతో తన్ని, కరెంట్ షాక్.

    తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్ హాట్‌గా ఉన్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ టార్గెట్‌గా సీఎం విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకున్న బండి సంజయ్.. తెలంగాణలో పాదయాత్ర చేశారు. ఆ యాత్ర సందర్భంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), అమిత్ షా (Amit Shah) రాష్ట్రంలో పర్యటించారు. ఈ రెండు సభలు కూడా సక్సెస్ కావడంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా వస్తుండడంతో బీజేపీలో మరింత జోష్ కనిపిస్తోంది. బీజేపీ నేతలే కాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించారు. ఇలా జాతీయ నేతల వరుస పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఆ సంకేతాలు ఉన్నందునే నేతలు రాష్ట్రానికి క్యూకట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Hyderabad, PM Narendra Modi, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు