POLITICS PM NARENDRA MODI INTERESTING COMMENTS ON ONCE AGAIN TAKING CHARGE AS PRIME MINISTER OF INDIA AK
PM Modi: మరోసారి ప్రధాని పదవి చేపట్టడంపై నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా జరిగిందంటూ..
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
PM Modi: గతంలో ఒకసారి తన భద్రతకు ముప్పు గురించి వార్తలు వచ్చాయని.. మరోసారి తన అనారోగ్యం గురించి వార్తలు వచ్చాయని మోదీ అన్నారు. అయితే కోట్లాది మంది సోదరీమణులు, తల్లుల అశీర్వాదం తనకు ఉందని.. ఆ కవచం ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
గుజరాత్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా ధీమాగా ఉండబోనని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇదిలా ఉంటే ఏ ప్రతిపక్ష నేతను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక వ్యక్తికి రెండుసార్లు ప్రధాని అయితే సరిపోతుందని భావిస్తున్నానని ఆయన అన్నారని.. అయితే తాను మరొక లోహంతో తయారు చేయబడిన వ్యక్తిని అని మోదీ అన్నారు. ఒకరోజు తనను ఒక పెద్ద నాయకుడు కలిశాడని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ (PM Modi) .. ఆయన రాజకీయాల్లో తరచుగా తమను వ్యతిరేకించాడని అన్నారు.
కానీ తాను ఆయనను గౌరవిస్తానని.. కొన్ని విషయాలలో ఆయన తనతో సంతోషంగా లేడని అన్నారు. అందుకే ఆయన తనను కలవడానికి వచ్చాడని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనతో రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారని అన్నారని.. ఇంకా మీకు ఏం కావాలని వ్యాఖ్యానించారని తెలిపారు. ఎవరైనా రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ దక్కుతాయని ఆయన అభిప్రాయపడినట్టు మోదీ తెలిపారు.
అయితే తాను ఏ లోహంతో తయారు చేయపడ్డానో తనకు తెలియదని.. గుజరాత్ (Gujarat) భూమి దానిని తయారు చేసిందని మోదీ వ్యాఖ్యానించారు. ఎలాంటి రేట్లను సడలించడంపై తనకు నమ్మకం లేదని... అనుకున్నది జరిగిపోయిందని తాను అనుకోవడం లేదని మోదీ అన్నారు. తనకు విశ్రాంతి తీసుకోవాలని లేదని... 100 శాతం మందికి ప్రజా ప్రయోజన పథకాలు చేరాలన్నది తన కల అని ప్రధాని మోదీ తెలిపారు.
గతంలో ఒకసారి తన భద్రతకు ముప్పు గురించి వార్తలు వచ్చాయని.. మరోసారి తన అనారోగ్యం గురించి వార్తలు వచ్చాయని మోదీ అన్నారు. అయితే కోట్లాది మంది సోదరీమణులు, తల్లుల అశీర్వాదం తనకు ఉందని.. ఆ కవచం ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
అయితే ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేరు చెప్పని ఆ నాయకుడు ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఆ నాయకుడు ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్(Sharad Pawar) అయి ఉంటారనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం శరద్ పవార్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగానే పవార్ మోదీతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.