హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నరేంద్ర మోదీ కొత్త రికార్డ్.. ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోయర్లు..

నరేంద్ర మోదీ కొత్త రికార్డ్.. ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోయర్లు..

ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఇండొనేసియా ప్రధాని (25.06 మిలియన్ల ఫాలోయర్లు) జోకో విడోడో ఉన్నారు.

ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఇండొనేసియా ప్రధాని (25.06 మిలియన్ల ఫాలోయర్లు) జోకో విడోడో ఉన్నారు.

ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఇండొనేసియా ప్రధాని (25.06 మిలియన్ల ఫాలోయర్లు) జోకో విడోడో ఉన్నారు.

  ప్రధాని నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్‌స్టా గ్రామ్‌లో ఆయనకు 30 మిలియన్ల ఫాలోయర్లు వచ్చారు. ప్రపంచ నేతల్లో ఏ నాయకుడికి కూడా ఈ స్థాయిలో ఫాలోయర్లు లేరు. 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మైలురాయిని అందుకున్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీకి ఇన్‌స్టాలో కూడా ఫాలోయర్లు పెరిగారు. ఎంతలాం అంటే.. ప్రపంచంలో ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ స్థాయిలో ఫాలోయర్లు ఉన్న నేత ఆయన ఒక్కరే. ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఇండొనేసియా ప్రధాని (25.06 మిలియన్ల ఫాలోయర్లు) జోకో విడోడో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (24.8 మిలియన్ల ఫాలోయర్లు), అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (14.9 మిలియన్ల ఫాలోయర్లు) కంటే కూడా మోదీ చాలా ముందున్నారు.

  ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోయర్లు

  ప్రధాని మోదీకి ఇన్‌స్టా గ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. గత సెప్టెంబర్‌లో 50 మిలియన్ల ట్విట్టర్ ఫాలోయర్లను సంపాదించారు. ఫేస్ బుక్‌లో ప్రధాని మోదీ అధికారిక ఖాతాకు 44 మిలియన్ల లైక్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యాక్టివ్‌గా, ఫాలోయర్లు ఉన్న నేత ప్రధాని మోదీ. ఇన్‌స్టా గ్రామ్‌లో అత్యంత ఎక్కువ ఫాలోయర్లు ఉన్న వ్యక్తి పోర్చుగీస్ ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 186 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

  డొనాల్డ్ ట్రంప్‌కు ఇన్‌స్టాలో 14.9 మిలియన్ల ఫాలోయర్లు

  మరోవైపు ప్రధాని మోదీ తాను రాసిన ఓ కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమిళనాడులోని మహాబలిపురంలో చెైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున చెత్తను కూడా తొలగించారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన ప్రధాని మోదీ ‘ఓ సంద్రమా.. నీకు నమస్సులు’ అనే టైటిల్‌తో రాసిన ఆ కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

  ఆర్టీసీ కార్మికుడి కడుపులో సీఐ పిడిగుద్దులు

  First published:

  Tags: Instagram, Pm modi, Social Media

  ఉత్తమ కథలు