హోమ్ /వార్తలు /జాతీయం /

2019 ఎన్నికల్లో మోదీ.. వడోదర నుంచే పోటీ?

2019 ఎన్నికల్లో మోదీ.. వడోదర నుంచే పోటీ?

నరేంద్ర మోదీ (File)

నరేంద్ర మోదీ (File)

గత ఎన్నికల్లో మోదీ రెండు స్థానాల్లో పోటీ చేశారు. గుజరాత్‌లోని వడోదర, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన మోదీ.. వడోదర స్థానాన్ని వదులుకుని వారణాసిలో ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇంకా చదవండి ...

  2019 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఎలక్షన్లకు సంబంధించి షెడ్యూల్‌ వచ్చేయడంతో దేశంలో ప్రధాన పార్టీలన్నీ అలర్టయ్యాయి. పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. ఈసారి ఎక్కణ్నుంచి పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయన మరోసారి సొంత రాష్ట్రంలోని వడోదరా నుంచే పోటీ చేస్తారని గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మోదీ రెండు స్థానాల్లో పోటీ చేశారు. గుజరాత్‌లోని వడోదర, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఘన విజయం సాధించారు. అనంతరం వడోదర స్థానాన్ని వదులుకుని వారణాసిలో ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో ఆయన వడోదరలో మారోసారి పోటీ చేయబోతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వడోదర పార్లమెంట్ స్థానంలో బీజేపీ పర్యవేక్షకుడు పంకజ్ దేశాయ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లో మోదీ వడోదర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో, ఈసారి కూడా ఈ స్థానం ప్రత్యేకత సంతరించుకుంది. గుజరాత్‌లో బీజేపీకి కంచుకోటగా చెప్పుకొనే వడోదర స్థానంలో.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ పటేల్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది.


  pm modi,narendra modi,puri,pm narendra modi,modi from puri,modi speech,narendra modi puri,odisha,modi to contest from puri,pm modi interview,narendra modi speech,narendra modi to contest from puri,modi contest 2019 election from puri,odisha's puri,will modi contest 2019 election from puri ?,Varanasi,loksabha elections 2019, ప్రధాని మోదీ, వారణాసి, పూరి నుంచి మోదీ పోటీ, లోక్‌సభ ఎన్నికలు
  వారణాసిలో మోదీ (File)


  ప్రధాని మోదీ తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒక స్థానమైన వడోదరకు రాజీనామా చేసిన తర్వాత.. ఉప ఎన్నికల్లో రంజనాబెన్ భాత్ విజయం సాధించారు. 2017 ఎన్నికల్లోనూ ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలన్నింటిలో బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. సాల్వి, వఘోదియా, వడోదర సిటీ, సయాజిగంజ్, అకోట, రావ్‌పురా, మంజాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున మరోసారి మోదీ ఇక్కణ్నుంచి అతి సునాయసంగా విజయం సాధిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  First published:

  Tags: Gujarat, Narendra modi, Pm modi, Varanasi

  ఉత్తమ కథలు