హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో మోదీ.. సిమ్లా యువతి అరుదైన కానుక..

PM Modi: హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో మోదీ.. సిమ్లా యువతి అరుదైన కానుక..

మోదీకి అరుదైన కానుక ఇస్తున్న సిమ్లా యువతి

మోదీకి అరుదైన కానుక ఇస్తున్న సిమ్లా యువతి

Himachal pradesh: దేశ ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సిమ్లాలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఒక యువతి ఆయనకు అరుదైన కానుక ఇచ్చింది.

భారత ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh) చేరుకున్నారు. ఆ తర్వాత సిమ్లాలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం.. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొమ్మిది కోట్ల నకిలీ పేర్లను తొలగించిందని అన్నారు. 2014కు ముందు ప్రతి వ్యవస్థ అవినీతి మయమైందన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి పరులతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు.


నవ భారతాన్ని రూపొందించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనంతరం మోదీ ప్రజలకు అభివాదం తెలిపారు. ఆ తర్వాత.. ర్యాలీ గుండా తన కాన్వాయ్ లో ప్రజలకు అభివాదం చేస్తు వెళ్తున్నారు. అప్పుడు ఒక యువతి మోదీ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఒక ఫోటో ఉంది. అప్పుడు మోదీ ఆమె దగ్గరకు వెళ్లారు. సిమ్లా  (Shimla girl) యువతి సంతోషంతో హీరాబెన్ పెయింటింగ్ ను (Heeraben painting)  మోదీకి అందించింది. మోదీ యువతి ట్యాలెంట్ ను కొనియాడారు. యువతి మోదీకి తన కానుక చేరడంతో తెగ సంబురపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గత 8 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా నన్ను నేను ప్రధానమంత్రిగా భావించలేదు.

బాధ్యతల స్వీకార పత్రంపై సంతకం చేసినప్పుడు మాత్రమే నేను ప్రధానిని. ఆ మరుక్షణం నుంచి 130 కోట్ల మంది భారతీయులకు ప్రధాన సేవకుణ్ని మాత్రమే..’అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.  (PM Modi) అన్నారు. (PM Modi Address At Garib Kalyan Sammelan) గతంలో దేశ ప్రజలు కుంభకోణాలు, వారసత్వ పార్టీల హీన రాజకీయాలు, ఉంటాయో, ఊడతాయో తెలీని పథకాల గురించి మాట్లాడుకునేవారిని, అయితే ఇప్పుడు మాత్రం కేంద్రం పథకాల వల్ల తమ జీవితాల్లో వచ్చిన, వస్తోన్న మార్పుల గురించే ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రధాని అన్నారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, భారతావనిని విశ్వగురువుగా నిలబెట్టడమే ధ్యేయంగా గడిచిన ఎనిమిదేళ్లుగా అకుంఠిత సేవలో నిమగ్నమయ్యామని, న్యూ ఇండియా తన లక్ష్యాన్ని చేరుకున్న అద్భుత దృశ్యాన్ని మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సిటీలోని రిడ్జ్ మైదానంలో మంగళవారం ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ 11వ విడత నిధులను రైతుల ఖతాల్లోకి జమచేశారు.

First published:

Tags: Himachal Pradesh, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు