Home /News /national /

POLITICS PM MODI OUTREACH TO PASMANDA MUSLIMS A STRATEGIC PAUSE PVN

Pasmanda Muslims : బీజేపీ బిగ్ స్కెచ్..దేశంలో ముస్లిం పార్టీలన్నీ అవుట్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PM Modi outreach to pasmanda Muslims : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. బీజేపీ ఓ పొలిటికల్ పిచ్ ను రెడీ చేస్తోంది. ముస్లింలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్న పార్టీలు బీజేపీ దెబ్బకు ఆలౌట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి మంత్రమే పార్టీ కార్యకర్తలకు బీజేపీ అందించింది

ఇంకా చదవండి ...
  PM Modi outreach to pasmanda Muslims : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. బీజేపీ(BJP) ఓ పొలిటికల్ పిచ్ ను రెడీ చేస్తోంది. ముస్లింలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్న పార్టీలు బీజేపీ దెబ్బకు ఆలౌట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి మంత్రమే పార్టీ కార్యకర్తలకు బీజేపీ అందించింది. దేశంలోని ముస్లిం రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాగలిగే అంశమే పస్మాండ ముస్లింలు(Pasmanda Muslims). ఈ పస్మాండా ముస్లింలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో.. సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్టీ కార్యకర్తలను దేశంలోని పస్మాండ(పర్షియన్ బాషలో వెనుకబడిన అని అర్థం) ముస్లింలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు సహాయం చేయాలని అన్నారు. అలాగే బీజేపీ జిల్లా యూనిట్‌లో వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు. బీజేపీలో వారికి సరైన ప్రాతినిథ్యం దక్కేలా ఉండాలని తెలిపారు. నిజానికి ముస్లింలలో 90:10 స్ధానంలో ఉండేలా.. ముస్లింలలో ఎక్కువ మంది ఓట్లను పొందేలా బీజేపీ ప్లాన్‌లో ఉందని భావిస్తున్నారు.

  ఇప్పుడు బీజేపీకి ముస్లింలలో 90:10 ఎందుకు కావాలి అనే విషయానికి వస్తే.. దీని వెనుక కూడా పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. అసలే హైదరాబాద్ ర్యాలీలో ప్రధాని మోదీ పేర్కొన్న పస్మండ ముస్లింలు.. ముస్లింలలో అత్యంత వెనుకబడిన విభాగంగా పరిగణించబడుతుంది లేదా ముస్లిం సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న ముస్లింగా పరిగణించబడుతుంది. గణాంకాల గురించి మాట్లాడితే దేశంలోని మొత్తం ముస్లిం జనాభాలో 70 శాతం పైగా పస్మాండ ముస్లింలు.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల్లోని ముస్లిం నేతలు అష్రఫ్ నుంచి వస్తున్నారు. ముస్లింలలో అష్రఫ్‌లను సయ్యద్‌లుగా, మొఘలులుగా, పఠాన్‌లను హిందువులలో అగ్ర కులాలుగా పరిగణిస్తారు. ఇప్పుడు ముస్లింలలో పస్మాండ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ ముస్లింలలో మాలిక్ అంటే టెలీ, మోమిన్ అన్సార్ అంటే నేత.. ఖురేషి అంటే కసాయి.. మన్సూరి అంటే మెత్తని బొంత, పరుపుల తయారీదారు.. ఇద్రిసీ అంటే టైలర్, సైఫీ అంటే కమ్మరి.. సల్మానీ అంటే మంగలి అని అర్థం. హవారీ అంటే.. ధోబీ జాతి ముస్లింలు.

  Kerala Tourist Places : వర్షాకాలంలో కేరళ ట్రిప్ కు ఫ్లాన్ చేస్తున్నారా..టాప్ 5 టూరిస్ట్ ప్లేస్ లు ఇవే

  బీజేపీ యొక్క ఈ వ్యూహం యూపీలో పెద్ద రాజకీయ దుమారం రేపుతుంది. యూపీలో పస్మాండ ముస్లింల జనాభా 90 శాతం వరకు ఉంది. ముఖ్యంగా మొరాదాబాద్, అలీఘర్, మీరట్, వారణాసి వంటి నగరాల్లో పస్మండ ముస్లింల జనాభా గణనీయంగా ఉంది. మరోవైపు,కొంతమంది నిపుణులు దేశంలో కేవలం 15శాతం మంది ముస్లింలు మాత్రమే ఉన్నారని, వారు ఉన్నత తరగతి లేదా ఉన్నత కులంగా పరిగణించబడుతున్నారని, వారిని అష్రఫ్ అని పిలుస్తారని తెలిపారు.  దీనిపై ముస్లిం వ్యవహారాల్లో నిపుణుడు, పస్మాండ సమస్యలపై పనిచేస్తున్న ఫయాజ్ అహ్మద్ ఫైజీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.."పస్మాండ ముస్లింలు అని పిలవడానికి బదులు, భారతీయ ముస్లిం మరియు విదేశీ మూలం ఉన్న ముస్లిం మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. తమను తాము అష్రఫ్‌లుగా పిలుచుకునే ముస్లిం తరగతి ప్రజలు విదేశీ మూలాలు కలిగి ఉండి,వారు తమను తాము పాలక వర్గంగా భావిస్తారు. అదే సమయంలో, పస్మండ ముస్లింలలో ఏదో ఒక సమయంలో హిందువులుగా ఉన్నవారు ఉన్నారు, కానీ వారు మతం మారిన తరువాత, వారు తమ స్వంత కులం మరియు సంస్కృతితో ఇస్లాంలోకి వచ్చారు. వారిలో అతిపెద్ద వర్గం వెనుకబడిన ముస్లింలు, వీరిని ముస్లింలలో అజ్లాఫ్‌లు అని పిలుస్తారు. హిందూ షెడ్యూల్డ్ కులాలకు సమానమైన వారిని అర్జల్‌లు అంటారు, అయితే అష్రాఫ్‌లు షేక్ సయ్యద్‌గా ఉన్నారు. వారి జనాభా దాదాపు 10శాతం"అని తెలిపారు. ప్రధాని మోదీ పస్మాండ ముస్లింలపై దృష్టి పెట్టడం.. గేమ్ ఛేంజర్ అని రాజకీయ నిపుణులు అంటున్నారు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Bjp, Muslim Minorities, Pm modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు