హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ.. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్ సందర్శన..

PM Modi: గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ.. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్ సందర్శన..

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

Gujarat Tour: భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం గుజరాత్ చేరుకున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

PM Modi On 3 Day Gujarat Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్ చేరుకున్నారు. ఆయనను సీఎం విజయ్ రూపాని ఎయిర్ పోర్ట్ లో సాదారంగా ఆహ్వనించారు. ఆ తర్వాత... మోదీ తన ప్రత్యేక కాన్వాయ్ లో గాంధీనగర్ చేరుకున్నారు. అదే విధంగా పీఎం .. గాంధీనగర్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే విధంగా.. గాంధీనగర్ లో విద్య సమీక్ష కేంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మోడీ.. విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో వివిధ అంశాలపై చర్చించారు.

విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అంశాలపై మోదీ అవగాహన కల్పించారు. ఇక, ఆయన తన పర్యటనలో భాగంగా రెండో రోజు.. ఏప్రిల్ 19న ఉదయం గాంధీనగర్ లో పర్యటిస్తారు. వివిధ అభివ్రుద్ది కార్యక్రమాలలో పాల్గొంటారు. అదే విధంగా, ఏప్రిల్ 19న ఉదయం 9:40 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను, జాతికి అంకితం చేయనున్నారు. బనస్కాంతలోని డియోదర్‌లోని బనాస్ డెయిరీ సంకుల్‌లో బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.


ఈ క్రమంలో.. మధ్యాహ్నం 3:30 గంటలకు జామ్‌నగర్‌లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఏప్రిల్ 20న ఉదయం 10:30 గంటలకు గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు దాహోద్‌లో జరిగే ఆదిజాతి మహా సమ్మేళనంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కాగా ,తన మూడు రోజుల పర్యటన గురించి మొదట ట్వీటర్ వేదికగా కార్యక్రమ సరళిని తెలిపారు.

ఏప్రిల్ 18 నుంచి, నేను గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉంటాను.. ఆ సమయంలో నేను గాంధీనగర్, బనస్కాంత, జామ్‌నగర్ మరియు దాహోద్‌లలో కార్యక్రమాలలో పాల్గొంటాను. ఈ కార్యక్రమాలు వివిధ రంగాలను కవర్ చేస్తామని తెలిపారు. అదే విధంగా, గుజరాత్ చేరుకున్న తర్వాత.. విద్యా సమీక్షా కేంద్రాన్ని సందర్శిస్తానని... ఈ ఆధునిక కేంద్రం లెర్నింగ్ ఫలితాలను మెరుగుపరచడానికి డేటా, సాంకేతికతను ప్రభావితం చేస్తుందని అన్నారు.

విద్యా రంగంలో పనిచేస్తున్న వారితో కూడా సంభాషిస్తానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బనస్కాంతలోని కార్యక్రమం ఏప్రిల్ 19న ఆకట్టుకునే బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. "కొత్త డెయిరీ కాంప్లెక్స్ మరియు బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ప్రారంభించబడుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక రైతులను శక్తివంతం చేస్తాయి మరియు వ్యవసాయ-డెయిరీ స్థలంలో విలువ జోడింపుకు దోహదం చేస్తాయి" అని ఆయన ట్వీట్ చేశారు.

First published:

Tags: Elections, Gujarat, PM Narendra Modi

ఉత్తమ కథలు