Home /News /national /

POLITICS PM MODI HAILS INDIA FARM STAND IN DIVIDED WORLD TAKES DIG AT DYNASTY PARTIES ON BJP FOUNDATION DAY MKS

Ukraine War: రెండుగా చీలిన ప్రపంచం.. ఇండియాది మానవత్వం.. వాళ్లను కూలగొడతాం: PM Modi

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం

ఉక్రెయిన్ సంక్షోభం, దాని చుట్టూ నెలకొన్ని ప్రపంచ రాజకీయాలు, అగ్ర రాజ్యాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం తదితర అంశాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎటు చూసినా శవాల గుట్టలు.. ధ్వంసమైన భవంతులు.. జనం హృదయ విదారక రోదనలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసలు.. గడిచిన నెలన్నర రోజులుగా ఉక్రెయిన్ దేశంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని నిలువరించాల్సింది పోయి.. అగ్గికి ఆజ్యం పోసినట్లుగా ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి, మారణహోమాన్ని ఎగదోస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. రష్యాకో, ఉక్రెయిన్‌కో అనుకూలంగా ఉన్నారనే, లేరనే కారణాలతో అగ్రరాజ్యాలు ఇతర దేశాలపైనా ఆంక్షలు విధిస్తుండటం పరిపాటిగా మారింది. ఇలాంటి సంకట స్థితిలో భారత్ ఒక్కటే స్థిరంగా శాంతి మంత్రాన్ని జపిస్తూ వస్తోంది. యుద్దం మానవత్వానికి విరుద్ధమని వాదిస్తున్నది ఇండియా ఒక్కటే. ఇదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తాజా ప్రసంగంలో ఉద్ఘాటించారు.

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇవాళ (ఏప్రిల్ 6న) ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం, దాని చుట్టూ నెలకొన్ని ప్రపంచ రాజకీయాలు, అగ్ర రాజ్యాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం తదితర అంశాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దేశ రాజకీయాల్లో కుటుంబ పార్టీలను సమూలంగా కూలగొడతామని , ఆ పనిని ఓటర్లే చేస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు.

మూర్తి గారి మరణ మిస్టరీ: చనిపోయాడని పూడ్చిపెడితే.. 24 గంటల్లో ఇంటికి తిరిగొచ్చాడు!


‘ప్రపంచం మొత్తం ఇవాళ రెండు వర్గాలుగా చీలిపోయింది. యుద్ద సంక్షోభంలో మానవత్వం గురించి మాట్లాడిన ఏకైక దేశం ఇండియానే. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇవాళ ఇండియా అంతర్జాతీయ సమాజం ముందు ధృఢంగా నిలబడింది’అని ప్రధాని మోదీ చెప్పారు. 75వ స్వాతంత్రవేడుకలు గొప్ప స్ఫూర్తిని నింపే సందర్భమని, వేగంగా మారుతోన్న ప్రపంచంలో భారత్ కు భారీగా కొత్త అవకాశఆలు వస్తున్నాయని ప్రధాని అన్నారు.

CM KCR: పన్ను పీకించుకొని కేసీఆర్ తిరుగుటపా! -ఢిల్లీ వరి దీక్షకు సీఎం పక్కాగా వెళతారా?


ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన నాలుగు రాష్ట్రాలనూ కాపాడుకొని తిరిగి అధికారంలోకి రావడాన్ని గుర్తుచేస్తూ.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరోసారి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, 30 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ఒక పార్టీ(బీజేపీ) 100(సీట్ల) మార్కును చేరుకుందని, ఇదంతా కార్యకర్తల కృషే అని మోదీ కొనియాడారు.

Jogipet జాతిరత్నాలు: తాగిన మైకంలో అబ్బాయికి తాళి కట్టాడు.. వాడేమో కాపురం చేస్తానని ఇంటికొచ్చాడు!


భారత రాజకీయాల్లో బీజేపీ ఒక్కటే దేశభక్తికి అంకితమైన పార్టీ అని, మిగతా పార్టీలు కుటుంబ పాలనకు, బందుప్రీతికి మొగ్గుచూపుతాయంటూ కాంగ్రెస్ పై పరోక్ష విమర్శలు చేశారు మోదీ. ‘ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకేం చేస్తారు లే! అనే నిరాశ ప్రజల్లో ఉండేది. దాన్ని తొలగించిన ఘనత బీజేపీదే. స్పష్టమైన లక్ష్యాలతో దేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తున్నది బీజేపీనే’అని ప్రధాని సెలవిచ్చారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Congress, Narendra modi, Pm modi, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు