హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pm Modi: ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్

Pm Modi: ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్

Pm Modi (Pc: Twitter)

Pm Modi (Pc: Twitter)

Pm Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సిడ్నీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య అనుబంధం చారిత్రాత్మకమైనదని..ఇరుదేశాల మధ్య క్రికెట్ కు మించిన అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ (Pm Modi) శుభవార్త చెప్పారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pm Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సిడ్నీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య అనుబంధం చారిత్రాత్మకమైనదని..ఇరుదేశాల మధ్య క్రికెట్ కు మించిన అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ (Pm Modi) శుభవార్త చెప్పారు. త్వరలోనే బ్రిస్బేన్ లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేస్తామన్న..మోదీ భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు కూడా పెంచుతామన్నారు. అలాగే గత 10 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని ప్రవాస భారతీయులకు మోదీ (Pm Modi) వివరించారు.

అలాగే ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిందని..ప్రపంచం మేలు కోసం భారత్ కృషి చేస్తుందని అన్నారు. వసుదైక కుటుంబమనేది భారత్ నినాదమని..మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంలా చూస్తున్నాని మోదీ (Pm Modi) పేర్కొన్నారు. కరోనా లాంటి పరిస్థితుల్లో 150 దేశాలకు వ్యాక్సిన్లు అందించడం గర్వంగా ఉందన్న ప్రధాని..పాల ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉందన్నారు. గత 9 ఏళ్లలో 500 మిలియన్ బ్యాంకు ఖాతాలు తెరిచాం. ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత బలపడింది. నైపుణ్యానికి కొదవలేదన్న ప్రధాని..భారత్ లోని ఫిన్ టెక్ విప్లవాన్ని ప్రపంచమంతా చూస్తుందని ప్రధాని మోదీ (Pm Modi) వివరించారు.

భారత్-ఆస్ట్రేలియా బంధాలను త్రి సీలు ప్రభావితం చేస్తున్నాయని..అవి కామన్ వెల్త్, క్రికెట్, కర్రీ అని..ఆ తర్వాత 3 డీలు దోస్తీ, డెమోక్రసీ, డయాస్పోరా అన్నారు. ఇరుదేశాలను కలిపి ఉంచే మరో బంధం యోగా అన్నారు. భారతీయ ప్రముఖ భాషలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయని..అలాగే భారతీయ వంటకాలు ఆస్ట్రేలియాలో లభిస్తాయన్నారు. తాను మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తానని 2014 చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రధాని మోదీ (Pm Modi) గుర్తు చేశారు. ఇక భారత దేశం అనేక అంశాల్లో నెంబర్ 1గా నిలిచిందన్నారు.

Bengaluru: ఆమె చీర ఐదుగురి ప్రాణాలను కాపాడింది..ఎలా, ఎక్కడో తెలుసా?

Rahul Gandhi:సెక్యురిటీ లేకుండా సిమ్లాకు వెళ్లిన రాహుల్‌గాంధీ..లారీలో ప్రయాణంచిన ఫోటోలు, వీడియో వైరల్

ఒక్క క్లిక్ తో డీబీటీ సాధ్యమైందని..కరోనా సమయంలో డబ్బులు పంపడానికి అనేక దేశాలు చాలా ఇబ్బందులు పడ్డాయన్నారు. పేమెంట్స్ లో యూపీఐ కొత్త శకానికి నాంది పలికాయన్నారు. ఇక ప్రస్తుతం భారత్ లో పారెక్స్ రిజర్వులు బాగా ఉన్నాయని..ప్రపంచ మేలు కోసం భారత్ కృషి చేస్తుందని మోదీ (Pm Modi) అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్భనీస్ ప్రధాని మోదీ (Pm Modi) ని ది బాస్ అని సంబోధించారు.

First published:

Tags: India, Modi, Narendra modi, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు