హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

దిగ్విజయ్‌కి యువకుడు షాక్...కాంగ్రెస్‌ సభలో మోదీపై ప్రశంసలు

దిగ్విజయ్‌కి యువకుడు షాక్...కాంగ్రెస్‌ సభలో మోదీపై ప్రశంసలు

తన సభలో మోదీపై ప్రశంసలు కురిపించడంతో డిగ్గీ రాజా షాకయ్యారు. ఒక్క క్షణం ఆయన నోట మాట రాలేదు. వెంటనే తేరుకున్న అతని అనుచరులు ఆ యువకుడిని స్టేజీ మీద నుంచి గెంటేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

''ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగిందే'', ''అనుకున్నదొక్కటి..అయినదొక్కటి'' ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలకు ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుంటాయి. ప్రత్యర్థులను జీరోలను చేసే క్రమంలో వాళ్లే జీరోలుగా మారుతుంటారు. అవతలి వాళ్లు హీరోలు అవుతారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మోదీపై విమర్శలు గుప్పించేందుకు ప్రయత్నించగా.. ఓ యువకుడు ఆయనకు షాకిచ్చాడు. కాంగ్రెస్‌ సభలో మోదీపై ప్రశంసలు కురిపించి ఝలకిచ్చాడు.

భోపాల్‌లో జరిగిన కాంగ్రెస్ సభకు యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. ఆ సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ..''ప్రతి ఒక్కరి అకౌంట్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు..ఎవరికైనా వచ్చాయా? '' అని అడిగారు. ఐతే జనంలో నుంచి ఓ యువకుడు చెయ్యి పైకెత్తడంతో అతడిని స్టేజి మీదకు పిలిచి ప్రశ్నించారు దిగ్విజయ్. దానికి సమాధానం చెప్పిన ఆ యువకుడు..''మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులు చంపేశాడు. అది చాలు.'' అని పేర్కొన్నాడు. తన సభలో మోదీపై ప్రశంసలు కురిపించడంతో డిగ్గీ రాజా షాకయ్యారు. ఒక్క క్షణం ఆయన నోట మాట రాలేదు. వెంటనే తేరుకున్న అతని అనుచరులు ఆ యువకుడిని స్టేజీ మీద నుంచి గెంటేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఎన్నికల్లో భోపాల్ లోక్‌‌సభ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో నాలుగు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే23న వెలువడనున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి:

First published:

Tags: Bhopal S12p19, Digvijaya Singh, Lok Sabha Election 2019, Madhya Pradesh Lok Sabha Elections 2019, Pm modi

ఉత్తమ కథలు