Home /News /national /

POLITICS PEOPLE NOT ACCEPT HYDERABAD AS INDIA S SECOND CAPITAL SAYS TELANGANA MINISTER KTR IN DELHI NK

హైదరాబాద్‌ని రెండో రాజధానిగా ప్రజలు ఒప్పుకోరు : మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఫైల్ ఫోటో

మంత్రి కేటీఆర్ ఫైల్ ఫోటో

Hyderabad Second Capital Issue : హైదరాబాద్‌ని దేశ రెండో రాజధానిగా చెయ్యాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి.

    Hyderabad Second Capital Issue : హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ నౌ సమ్మిత్‌లో పాల్గొన్న ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తోందనీ... ఢిల్లీ కూడా హైదరాబాద్ వైపు చూడటం గర్వంగా ఉందని అన్నారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందిందనీ, పలు సర్వేల్లో ఉత్తమ నివాస యోగ్యమైన నగరంగా హైదరాబాద్ అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. ఐతే... హైదరాబాద్‌ను రెండో రాజధానిగా అక్కడి ప్రజలే కాదు... ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఒప్పుకుంటారని తాను అనుకోవట్లేదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ని దేశ రెండో రాజధానిగా చెయ్యాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి.

    telugu varthalu, breaking news, telugu news, news today, national news, india news, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
    చార్మినార్ (File)


    దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ చాలా దూరంగా ఉంది. అదే ఉత్తరాది రాష్ట్రాలకు ఢిల్లీ దగ్గరగా ఉంది. అందువల్ల చాలా అంశాల్లో, ఆర్థిక పరమైన కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ పాలకులు సరైన న్యాయం చెయ్యట్లేదన్న భావన దక్షిణాది రాష్ట్రాల పాలకులకు ఉంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలనే అభిప్రాయం, డిమాండ్, ఆశలు ఉన్నాయి. దానికి తోడు... రాష్ట్రపతి కూడా శీతాకాల విడిది కింద ఏటా హైదరాబాద్‌కి వస్తుంటారు. వాతావరణ పరంగా కూడా హైదరాబాద్ కొంత చల్లదనంతో ఆకట్టుకుంటుంది. కాలుష్యం విషయంలోనూ ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్ ఎంతో బెస్ట్. అందువల్ల హైదరాబాద్‌ని రెండో రాజధానిగా ప్రకటించాలని చాలా మంది కోరుతున్నారు. ఐతే... ఇందుకు విరుద్ధంగా కేటీఆర్ తన అభిప్రాయం చెప్పడం చర్చనీయాంశమైంది.

    దేశమంతా ఒక్కటనే భావన : హైదరాబాద్‌ని రెండో రాజధానిగా ప్రకటిస్తే... అది తెలంగాణ ప్రభుత్వానికీ, హైదరాబాద్ ప్రజలకూ కలిసొచ్చే నిర్ణయమే. కానీ దేశ భౌగోళిక, రాజకీయ పరంగా ఇది మంచి నిర్ణయం కాదనే ఉద్దేశంతో కేటీఆర్ ఇలా మాట్లాడి ఉండొచ్చని తెలుస్తోంది. దేశమంతా ఐక్యతా భావంతో ఉండాలనీ... ఇలా రాజధానులుగా విడిపోతే... రేపొద్దున మరిన్ని ఇలాంటి డిమాండ్లు ఏర్పడే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో కేటీఆర్ ఇలాంటి అభిప్రాయంతో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా... ఢిల్లీలో జరిగిన సదస్సుతో మరోసారి హైదరాబాద్ రెండో రాజధాని అనే అంశం మళ్లీ ఫోకస్ అవుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telangana, Telangana News, Telangana updates

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు