హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చించనునున్న పవన్ కల్యాణ్

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చించనునున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ (twitter/photo)

పవన్ కల్యాణ్ (twitter/photo)

తెలంగాణ సీఎంపై అపార గౌరవం ఉందన్న పవన్.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయన్ను కలుస్తానని చెప్పారు. కేసీఆర్‌ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రత్యేకంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు.

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం.. అటు ఆర్టీసీ జేఏసీ.. ఇద్దరూ పంతం వీడడం లేదు. హైకోర్టు జోక్యం చేసుకున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, డిమాండ్లను వివరించిన అనంతరం.. సమ్మెకు మద్దతివ్వాలని ఆయన్ను కోరారు. పవన్‌ను కలిసిన వారిలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు.

  ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్.. కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. దాదాపు నెల రోజులగా సమ్మెలో ఉండడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. తెలంగాణ సీఎంపై అపార గౌరవం ఉందన్న పవన్.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయన్ను కలుస్తానని చెప్పారు. కేసీఆర్‌ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రత్యేకంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ సీఎం పట్టించుకోకుంటే కార్మికులు చేస్తున్న ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వెల్లడించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Pawan kalyan, Rtc jac, Telangana, TSRTC Strike

  ఉత్తమ కథలు