Home /News /national /

POLITICS PAWAN KALYAN SHARES AMERICAN ISAAC RECHARDS TELUGU VIDEO SK

ఆ అమెరికన్ తెలుగు మాటలకు పవన్ కళ్యాణ్ ఫిదా

ఐసాక్ రిచర్డ్స్, పవన్ కళ్యాణ్

ఐసాక్ రిచర్డ్స్, పవన్ కళ్యాణ్

ఆ వీడియోలో తెలుగు మాట్లాడుతున్న అమెరికన్.. తెలుగు ప్రజలకు సుపరిచితమే. అతడి పేరు ఐసాక్ రిచర్డ్స్. మొన్నా మధ్య అతడు తెలుగు మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో చాలా ఫేమస్ అయిపోయాడు.

    ఏపీలో ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు భాషపై దుమారం రేగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తెలుగు భాషను చంపేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నుడి-మన నది అంటూ కొత్త నినాదం అందుకున్నాడు. తెలుగు భాష పరిరక్షణకు అందరు కలిసిరావాలంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగు భాష మాట్లాడుతున్న అమెరికన్ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మనం తెలుగును విస్మరిస్తున్నాం.. కానీ ఈ అమెరికన్ మాత్రం తెలుగు మాట్లాడుతున్నాడంటూ అందులో పేర్కొన్నాడు. ఆ వీడియోలో తెలుగు మాట్లాడుతున్న అమెరికన్.. తెలుగు ప్రజలకు సుపరిచితమే. అతడి పేరు ఐసాక్ రిచర్డ్స్. మొన్నా మధ్య అతడు తెలుగు మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో చాలా ఫేమస్ అయిపోయాడు. మనోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే అతడేమో తెలుగులో మాట్లాడండి అంటూ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు తెలుగు భాష కోసం యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. 'ఐసాక్ రిచర్డ్స్ తెలుగు మర్చిపోకూడదు' అనే ఛానెల్ ద్వారా తెలుగు వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.

    కాగా, ఐసాక్ రిచర్డ్స్ 2016-18 మధ్య రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో నివసించాడు. కొన్ని రోజులు వైజాగ్‌లో, ఆ తర్వాత మరో ఏడాది విజయవాడలో ఉన్నాడు. ఆ సమయంలోనే తెలుగు నేర్చుకున్నాను. ప్రస్తుతం అమెరికాలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాడు. ఇక అక్కడికి వెళ్లే తెలుగు టూరిస్టులతో తెలుగులోనే మాట్లాడతాడు రిచర్డ్స్. ఓ రోజు తెలుగులో మాట్లాడుతుంటే అమ్మాయి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇతగాడి తెలుగు ప్రపంచానికి పరిచయమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Telugu language

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు