జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు (30-12-2019) విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ వ్యవహారాల కమిటీ, వ్యూహాత్మక కమిటీల సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీతోపాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానం, పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యచరణ తదితర అంశాలపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. కీలకమైన ఈ సమావేశానికి హాజరైన సభ్యులు అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారు. ఇటీవల నాదెండ్ల మనోహర్, నాగబాబు, ముఖ్య నాయకులు రాజధాని గ్రామాలలో పర్యటించి రైతులను, ప్రజలను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను పవన్ కళ్యాణ్‌కు అందచేశారు. ఆ పరిశీలన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Janasena party, Pawan kalyan