హోమ్ /వార్తలు /national /

రాపాకకు పవన్ కళ్యాణ్ ఘాటు లేఖ... పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే...

రాపాకకు పవన్ కళ్యాణ్ ఘాటు లేఖ... పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే...

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో... జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని తరలించేందుకు వీలుగా... ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే... మద్దతిస్తానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడంతో... ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్చించిన పార్టీ... ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ... ఓ లేఖను రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే... ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవల‌ప్‌మెంట్ రిజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై... పార్టీ నిర్ణయానుసారం నడుచుకోవాలని లేఖలో రాపాకను కోరారు. ఒకవేళ రాపాక జనసేన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

  రాపాకకు జనసేన లేఖ

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Amaravati, AP News, AP Politics, Janasena party, Pawan kalyan, Rapaka varaprasad

  ఉత్తమ కథలు