పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది అనుకున్న మాట.. ‘పవన్ కళ్యాణ్ ఏంటి? పాలిటిక్స్ ఏంటి? అసలు రాజకీయం చేయడం వచ్చా?’ అని అనుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఐదేళ్ల పాటు పెద్దగా యాక్టివ్‌గా లేరు. మధ్యమధ్యలో అమరావతి, ఉద్ధానం కిడ్నీ సమస్యల వంటి అంశాల్లో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించినా.. అంత ప్రతిఘటన రాలేదు. అయితే, గత రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తే.. ‘ఈ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణేనా?, మొత్తం రాటుదేలినట్టున్నాడు.’ అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైఎస్ జగన్ పరిపాలన మీద ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత మీద పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నిర్వహించిన లాంగ్ మార్చ్ రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనానికి దారి తీసింది. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని ప్రభుత్వం కూడా అధికారికంగా అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత తెలుగు భాష, ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీని మీద ప్రభుత్వం తమ పని తాను సమర్థించుకున్నా... జనసేనానికి ఘాటుగానే కౌంటర్లు ఇస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ‘జగన్ మతం’ అంశం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వం కూడా అదే రీతిలో స్పందిస్తున్నా.. పవన్ ట్వీట్ల ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తుంది.
ఓ రకంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను లైట్ తీసుకున్న జగన్ మోహన్ రెడ్డిని.. తన ట్వీట్ల ఫైట్‌తో స్పందించే స్థితికి తీసుకొచ్చారు. తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ రాటు దేలారా? లేకపోతే తనదైన రాజకీయాన్ని ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Janasena party, Pawan kalyan